ప్రపంచ స్థాయి శక్తివంత మహిళ జాబితాలో..భారత మహిళ..!!

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారుల జాబితాలో చోటుదక్కించుకున్నారు భారత్ కి చెందిన మహిళా వ్యాపారవేత్త జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీ ఆర్‌ఈ) చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ) అలైస్‌ వైద్యన్‌.

అంతేకాదు మరొక విశేషం ఏమిటంటే ఈ జాబితాలో స్థానం పొందింది ఈమె ఒక్కరే కావడం విశేషం.

ప్రస్తుత సంవత్సరానికి గాను అమెరికా వెలుపల 50 మంది శక్తిమంత మహిళా వ్యాపారులతో ఫార్చ్యున్‌ మ్యాగజైన్‌ ఈ జాబితా రూపొందించింది.ఈ జాబితాలో అలైస్‌ వైద్యన్‌కు 47వ ర్యాంకు లభించింది.గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎమ్మా వామ్‌స్లేకు అగ్రస్థానం దక్కింది.

ఇదిలాఉంటే నాలుగేళ్లుగా మొదటి ర్యాంకులో ఉన్న బాన్కో సాంటాండెర్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అనాబోటిన్‌ ఈ సారి ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు.అమెరికా వెలుపల అత్యంత శక్తిమంత మహిళా వ్యాపారుల జాబితాను 18 ఏళ్లుగా ఫార్చ్యూన్‌ రూపొందిస్తోంది.

ఈ 50 మంది 19 దేశాలకు చెందిన వివిధ రంగాల్లోని వారు.వైద్యన్‌ 2016లో బీఐసీ చైర్మన్‌గా పగ్గాలు స్వీకరించారు.ఆమె నాయకత్వంలో ప్రపంచంలోని 10 అత్యుత్తమ రీఇన్యూరెన్స్‌ కంపెనీల్లో ఒకటిగా బీఐసీ స్థానాన్ని పొందింది.

Advertisement

ఆమెకి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడంతో ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు మహిళా వ్యాపారవేత్తలు.

ట్రంప్‌ కోసం వైట్‌హౌస్ ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తుందంటే?
Advertisement

తాజా వార్తలు