ఈ ఇంటి చిట్కాల‌తో త‌ల‌లో పేలు ప‌రార్‌..!

తలలో పేలు.( Head Lice ) చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

ముఖ్యంగా ఆడవారు, బడికి వెళ్లే పిల్లల్లో పేలు సమస్య అత్యధికంగా ఉంటుంది.పేలు కార‌ణంగా తీవ్ర‌మైన దుర‌ద‌, దద్దుర్లు, వెంట్రుక‌ల బ‌ల‌హీనంగా మార‌డం, జుట్టు అధికంగా రాలిపోవ‌డం, ర‌క్త‌హీన‌త‌, నిద్ర‌లేమి, చివ‌ర‌కు త‌దిత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి.

ఈ క్ర‌మంలోనే పేలును వ‌దిలించుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్ప‌బోయే ఇంటి చిట్కాలు ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

టిప్‌-1:

స్ట‌వ్‌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక ఒక కప్పు వెల్లుల్లి( Garlic ) తొక్కలు, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek Seeds ) వన్ టేబుల్ స్పూన్ క‌లోంజి సీడ్స్ వేసి పదినిమిషాల పాటు మరిగించి వడకట్టాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ కు ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

Advertisement
Get Rid Of Head Lice With These Home Remedies Details, Head Lice, Lice, Home Rem

గంట తర్వాత తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఇలా చేస్తే పేలు పరారవుతాయి.

తల చర్మం శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది.

Get Rid Of Head Lice With These Home Remedies Details, Head Lice, Lice, Home Rem

టిప్‌-2:

మ‌న వంటింట్లో ఉండే నెయ్యితో( Ghee ) పేలు స‌మ‌స్య‌ను దూరం చేసుకోవాలి.రెండు టేబుల్ స్పూన్లు నెయ్యికు తీసుకుని త‌ల‌కు బాగా ప‌ట్టించాలి.తర్వాత సన్నని దువ్వెనతో దువ్వితే పేలు మొత్తం వ‌చ్చేస్తాయి.

అప్పుడు మైల్డ్ షాంపూను ఉప‌యోగించి హెయిర్ వాష్ చేసుకుంటే త‌ల శుభ్ర‌ప‌డుతుంది.

Get Rid Of Head Lice With These Home Remedies Details, Head Lice, Lice, Home Rem
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి23, ఆదివారం 2025
తిరుమల: ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

టిప్-3:

సీతాఫల గింజలను చాలా మంది పారేస్తుంటారు.కానీ వంటిని ఎండ‌బెట్టి పొడి చేసుకుంటే పేలు నివార‌ణ‌కు తోడ్ప‌డుతుంది.సీతాఫల గింజల పొడిలో కొన్ని వాట‌ర్ పోసి క‌లుపుకోవాలి.

Advertisement

ఈ మిశ్ర‌మాన్ని స్కాల్ప్ కు బాగా ప‌ట్టించి ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.అనంత‌రం తేలిక‌పాటి షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.

వారానికి ఒక‌సారి ఇలా చేసినా కూడా పేలు స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

తాజా వార్తలు