పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ గణేష్ నవరాత్రి ఉత్సవాలు:ఎస్పీ

సూర్యాపేట జిల్లా: సోదరభావంతో అందరూ కలిసి మెలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను( Ganesh Chaturthi )జరుపుకోవాలని,జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుందని,ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్( SP Rajendra Prasad ) పిలుపునిచ్చారు.

మండపాల నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలని,మండపాల వద్ద డిజెలకు అనుమతి లేదన్నారు.

ఉత్సవాలు భక్తి భావంతో జరుపుకోవాలని, సోదరభావం అనేది తెలంగాణ రక్తంలోనే వుందన్నారు.గణేష్ మండపాలు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేయవద్దని,వాహనాలకు దారి వదలాలని కోరారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్బంగా గణేష్ మండపాల ఏర్పాటుకు,విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలన్నారు.అన్లైన్ అనుమతి కోసం ఈ లింక్ https://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.మండపాలు ఏర్పాటు చేసే స్థలం పబ్లిక్ స్థలం అయితే సంబంధిత గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ అనుమతి పత్రం తీసుకోవాలని, ప్రవేట్ వ్యక్తుల స్థలం అయితే స్థలం యొక్క యజమాని అనుమతి పత్రం తీసుకోవాలని, ఉత్సవాలు ముగిసే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలు మండపాల వద్ద అందుబాటులో ఉండాలని,భక్తులు వచ్చిపోయే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని,ట్రాఫిక్ అంతరాయం( Traffic disruption ) కలిగించొద్దన్నారు.

విద్యుత్ శాఖ అనుమతి ఉండాలని,వివాదాస్పద స్థలాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేయొద్దన్నారు.ఇతరులను రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదంగా మండపాల వద్ద ప్రసంగాలు చేయవొద్దన్నారు.మండపాల వద్ద భక్తి సంబంధిత పాటలు మాత్రమే ప్రసారం చేయాలని,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన అనుమతి అర్జీదారులు, ఉత్సవకమిటీ సభ్యులే బాధ్యత వహించాలన్నారు.

Advertisement

నిర్ణీత సమయంలో మాత్రమే మైక్ లు పెట్టాలని, ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటలకు నిర్ణీత వాల్యూంలో మాత్రమే వాడాలన్నారు.ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని,డీజేలకు, బాణాసంచాకు అనుమతి లేదన్నారు.

ఈ నిబంధనలు ప్రతీ మండపం వద్ద .

Advertisement

Latest Suryapet News