ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న ట్రక్కును ఓ కారు ఢీకొట్టింది.
మథురలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారని తెలుస్తోంది.
కోకిలావన్ శని దేవుని ఆలయాన్ని సందర్శించి అలిఘర్ కు తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ఈ ఘటనలో ముగ్గురు స్నేహితులతో పాటు కారు డ్రైవర్ మృతిచెందారు.రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.