పసికూన చేతిలో ఓడిన భారత్.. రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు..!

తాజాగా ఆసియా కప్ టోర్నీ( Asia Cup )లో సూపర్-4 దశలో భారత్- బంగ్లాదేశ్( India Vs Bangladesh ) మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ ఆరు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) ఖాతాలో ఓ చెత్త రికార్డు పడింది.

 India Lost At The Hands Of Pasikoona Rohit Sharma's Account Has The Worst Record-TeluguStop.com

రోహిత్ శర్మ తొలి ఓవర్ లో రెండో బంతికే అవుట్ అయ్యి ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుదిరిగాడు.దీంతో ఆసియా కప్ చరిత్రలో డక్ అవుట్ అయిన రెండో భారత కెప్టెన్ గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

రోహిత్ శర్మ కన్నా ముందు 1988 ఆసియా కప్ లో అప్పటి భారత కెప్టెన్ దిలీప్ సర్కార్ డక్ అవుట్ అయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మకు ఇది 29వ డకౌట్.టాప్ ఆర్డర్ లో సచిన్ టెండుల్కర్ 34, విరాట్ కోహ్లీ( Virat Kohli ) 33, వీరేంద్ర సెహ్వాగ్ 31, రోహిత్ శర్మ 29 సార్లు డకౌట్ అయ్యారు.ఆసియా కప్ లో రెండుసార్లు డకౌట్ అయిన తొలి భారత ఓపెనర్ గా రోహిత్ శర్మ నిలిచాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.బంగ్లాదేశ్ బ్యాటర్లైన షకీబ్ అల్ హసన్( Shakib Al Hasan ) 80, తోహిద్ హృదయ్( Tauhid Hriday ) 54, నసుమ్ అహ్మద్ 44, మోహదీ హాసన్ (29 నాట్ అవుట్) పరుగులు చేశారు.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు 139 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.కెప్టెన్ రోహిత్ శర్మ 0, తిలక్ వర్మ 5, ఇషాన్ కిషన్ 5, కేఎల్ రాహుల్ 19, సూర్య కుమార్ యాదవ్ 26 పరుగులతో దారుణంగా విఫలమయ్యారు.

భారత జట్టు మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ 121, అక్షర్ పటేల్ 42 పరుగులతో రాణించారు.చివరి బంతి వరకు పోరాడిన భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube