సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిన గ‌ద్వాల్ రెడ్డి బిడ్డ మృతి..

సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత ఎంద‌రో స్టార్లు అయిపోయారు.అంత‌కు ముందు సినిమాల్లో క‌నిపిస్తేనే సెల‌బ్రిటీలుగా చూసే వారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారిపోయింది.సోష‌ల్ మీడియా ద్వారానే త‌మ‌కు తామే అవ‌కాశాలు సృష్టించుకుంటున్నారు.

త‌మలోని ట్యాలెంట్ తో ఎంద‌రో ఫేమ‌స్ అవుతున్నారు.ఇలా ఫేమ‌స్ అయిన వారు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు.

కాగా ఇలా సోష‌ల్ మీడియా ద్వారా పేరు తెచ్చుకున్న బుడ్డోడే గ‌ద్వాల్ రెడ్డి గారి బిడ్డ‌.సోష‌ల్ మీడియాలో అన‌తి కాలంలోనే సంచ‌ల‌నంగా మారిపోయాడు ఈ బుడ‌త‌డు.

Advertisement
Gadwal Reddy S Baby Dies , Social Media , Gadwal Reddy Baby , Viral News , Soc

అయితే అత‌ని జీవితం చాలా చిన్న వ‌య‌సులోనే విషాదాంత‌గా మారిపోయింది.అనారోగ్యంతో అత‌ను చ‌నిపోయాడు.

అత‌నే మల్లికార్జున్ రెడ్డి.జోగులాంబా జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె గ్రామానికి చెందిన మ‌ల్లికార్జున్ సోష‌ల్ మీడియాలో వీడియోలు పెడుతూ బాగా పేరు తెచ్చుకున్నాడు మ‌ల్లికార్జున్‌.

అయితే అత‌నికి మొద‌టి నుంచే ఆస్తమాతో పాటు వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నాయ‌ని చెబుతున్నారు కుటుంబ స‌భ్యులు.దీంతో వాటితో నిత్యం బాధ ప‌డేవాడు.

అయినా స‌రే సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా వీడియోలు చేసేవారు.

Gadwal Reddy S Baby Dies , Social Media , Gadwal Reddy Baby , Viral News , Soc
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
రాజమౌళి మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్...

మొన్న చేసిన ఆర్జీవీ వీడియో కూడా బాగానే ఫేమ‌స్ అయింది.ఇక ఇత‌ని మీద సోష‌ల్ మీడియాలో మీమ్స్‌కూడా క్రియేట్ చేస్తున్నారు మీమ‌ర్స్‌.త‌న‌దైన టైమింగ్ అండ్ డైలాగుల‌తో ఎంతో మందిని అల‌రిస్తున్న ఈ బుడ్డోడు.

Advertisement

చివ‌ర‌కు ఇలా చ‌నిపోవ‌డం అంద‌రినీ విషాదానికి గురి చేస్తోంది.ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

ఈ వార్త తెలుసుకున్న అత‌ని ఫాలోవ‌ర్స్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.చాలా మంది సోష‌ల్ మీడియాలో అత‌నికి సంతాపాన్ని తెలియ‌జేస్తున్నారు.

త‌ల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. చాలామంది ఈ వార్త‌ను షేర్ చేస్తున్నారు.

తాజా వార్తలు