Perni Nani : ‘సిద్ధం’ సభకు బస్సు డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి పేర్ని నాని..!!

ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ ప్రతిష్టాత్మకంగా ‘సిద్ధం’( Siddham ) భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.మరికాసేపటిలో ఈ సభ ప్రారంభం కానుండగా.

వైసీపీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సిద్ధం సభ కోసం మాజీమంత్రి పేర్ని నాని( Perni Nani ) బస్సు డ్రైవర్ గా( Bus Driver ) మారారు.

పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలను బస్సులో సభా వేదికకు తీసుకెళ్లారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే పేర్ని నాని గతంలో ట్రాన్స్ పోర్టు మంత్రిగా( Ex Transport Minister ) పని చేసిన సమయంలోనూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.అంతేకాదు కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ పోలీసులు, కార్మికులతో కలిసి భోజనం చేశారు.

Advertisement

ఎప్పుడు ప్రజల్లోనే ఉండే ఆయన ప్రస్తుతం దెందులూరు సభకు శ్రేణులను తరలించడానికి రథసారథిగా మారారు.

విశ్వక్ సేన్ కు జోడీగా డ్రాగన్ బ్యూటీ.. టాలీవుడ్ లో ఈమె బిజీ కావడం ఖాయమా?
Advertisement

తాజా వార్తలు