ప్రతి దళిత కుటుంబానికి రూ.30 లక్షలు ఇవ్వాలి

తెలంగాణలో దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ ముందుకు రావాలంటూ మాజీ మంత్రి రాజయ్య విజ్ఞప్తి చేశాడు.

రాష్ట్రంలోని అర్హులు అయిన ప్రతి దళిత కుటుంబానికి 30 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేయాలంటూ కోరాడు.

ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకు వెళ్తామంటూ చెప్పుకొచ్చాడు.దళితులు చాలా ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వారు ఆర్ధిక సాయం కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో వారికి చేదోడు వాదోడుగా ఉంటే ఖచ్చితంగా వారు ఉన్నత స్థాయికి వస్తారని అన్నారు.ఎస్సీల్లో మాదిగలే ఎక్కువగా నష్టపోతున్నారని, ఎస్సీల్లో మళ్లీ ఉప కులాలను ఏర్పాటు చేయడం వల్ల అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మాదిగా ఉప కులానికి చెందిన కడియం శ్రీహరి 18 ఏళ్లు మంత్రిగా చేసినా ఆయన ఏమాత్రం న్యాయం చేయలేక పోయారంటూ రాజాయ్య విమర్శించాడు.ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు తీసుకు వెళ్తానంటూ హామీ ఇచ్చాడు.

Advertisement
పిఠాపురంలో యూ.ఎస్.ఏ, ఎన్.ఆర్.ఐ సేవలు అభినందనీయం అంటూ నాగబాబు కామెంట్స్..!!

తాజా వార్తలు