పోలవరం కోసం విదేశీ నిపుణులు రప్పిస్తున్నాం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!!

ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) శుక్రవారం అమరావతిలో పోలవరంపై సమీక్ష నిర్వహించారు.

ఈ క్రమంలో ప్రాజెక్టు పనులు ఎంతవరకు పనులు జరిగాయి అన్నదానిపై శ్వేత పత్రం విడుదల చేయబోతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.

ఈ క్రమంలో నీటిపారుదల రంగానికి సంబంధించి తమ ప్రభుత్వం చేసే ప్రతి పనికి సంబంధించి డాక్యుమెంట్లు వెబ్ సైట్ లో పెడతామని పేర్కొన్నారు.తాము విడుదల చేయబోయే శ్వేతపత్రం రెండు భాగాలుగా ఉంటుందని అన్నారు.

ఒకటి పోలవరం ప్రాజెక్టుకి( Polavaram project ) సంబంధించి మరొకటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిందని తెలిపారు.రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం ఎంతో ఉంది.

2014 నుంచి 2019 వరకు సాగునీటి ప్రాజెక్టులపై 67 వేల కోట్లు ఖర్చు పెట్టాం.ఇప్పుడైతే వాటి నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.పోలవరం ప్రాజెక్టు కట్టడం కంటే మరమ్మత్తు ఇంకా కష్టమైన పనిగా మారిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement

తాము పడిన శ్రమను జగన్( Jagan ) వృధా చేశారని విమర్శించారు.కాగా ప్రాజెక్టుల మరమ్మత్తుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణులు రప్పిస్తున్నట్లు వెల్లడించారు.వాళ్లు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

పోలవరం ఎంత కాలంలో బాగు చేయవచ్చు అనేది నిపుణులు తేలుస్తారు.ఇటీవల పోలవరం ప్రాజెక్టు చూసినప్పుడు కళ్ళు వెంట నీళ్లు వచ్చాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు