వీటిని పచ్చిగా తినకూడదు

తెలిసో తెలియకో కొన్నిటిని పచ్చిగా తినేస్తుంటాం మనం.

పచ్చిగా ఏది తిన్నా చేటు జరుగుతుందని చెప్పలేం కాని, కొన్నిటిని పచ్చిగా తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి.

కాబట్టి పచ్చిగా ఏవేవి తినకూడదో తెలుసుకోండి.* పాలు పచ్చిగా తాగడం అంత మంచిది కాదు.

ఎందుకంటే పచ్చిపాలలో లిస్టేరియా, బ్రూసెల్లా ఉంటాయి.వీటి వలన వాంతులు, తలనొప్పి, కడుపులో నొప్పి లాంటి ఇబ్బందులు రావొచ్చు.

* పచ్చి మాంసం అస్సలు ముట్టకపోతేనే మంచిది.పచ్చి మాంసంలో సల్మోనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది.

Advertisement

దీని వలన జ్వరం, తలనొప్పి, డయేరియా వచ్చే ప్రమాదం ఉంది.కాబట్టి మాంసం మనకు ఇష్టమైన పద్ధతుల్లో వండుకోని మాత్రమే తినాలి.

* పచ్చి కోడిగుడ్డులో కూడా సల్మోనెల్లా ఉంటింది.ఇది కూడా పచ్చి మాంసం మోసుకొచ్చె ఇంఫెక్షన్స్ ని మోసుకురాగలదు.

ఉడకబెట్టిన గుడ్డే ఆరోగ్యం.* బాదాంని నీళ్ళలో నానాబెట్టిన తరువాత తినాలి.

లేదంటే సియనైడ్ అలాగే ఉండిపోతుంది.దాని వలన కడుపులో మంటతోపాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరగొచ్చు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
ఈ జ్యూసుల‌తో వేగంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు..తెలుసా?

* మష్రూమ్స్ పెరిగే వాతావరణమే వేరు.దీనిలో కార్సినోజెనిక్ ఉంటుంది.

Advertisement

పచ్చిగా తింటే హైటాక్సిక్ లెవెల్స్ పెరుగుతాయి.కాబట్టి ఉడికించి తినాలి.

* గ్రీన్ వెజిటబుల్స్ కూడా పచ్చిగా తినకూడదు.ఉడకబెట్టాకే తినాలి.

లేదంటే ఆక్సిలిక్ ఆసిడ్ మన బాడిలోకి కాల్షియం, ఐరన్ ని రానివ్వదు.* ఇవి మాత్రమే కాదు, టమోటాలు, మొలకలు, జీడిపప్పు, ఇంకా ఎన్నోరకాల కూరగాయలను పచ్చిగా తినకూడదు.

తాజా వార్తలు