ఇంట్లోనే పార్లర్ గ్లో పొందడానికి ఈ రెమెడీ ని ఫాలో అవ్వండి!

తమ స్కిన్ గ్లోయింగ్ గా మరియు బ్యూటిఫుల్ గా మెరుస్తూ కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.

అందులో భాగంగానే కొందరు నెలకు ఒకటి లేదా రెండు సార్లు బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్, టాన్ రిమూవ్ తదితర ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు.

ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పార్లర్ గ్లో పొందవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.మరి ఇంత‌కీ ఆ హోమ్‌ రెమెడీ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక చిన్న బంగాళదుంప(potato) తీసుకుని వాటర్ తో శుభ్రంగా క‌డిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక చిన్న టమాటోను(Tomato) కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న‌ బంగాళదుంప ముక్కలు, టమాటో ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి(Besan flour), రెండు టేబుల్ స్పూన్లు పెసర పిండి(Moong flour), వన్ టేబుల్ స్పూన్ పెరుగు(curd) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని వారానికి రెండు సార్లు పాటించడం వల్ల చర్మంపై మురికి మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి.

మొండి మచ్చలు క్రమంగా మాయమవుతాయి.మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.

స్కిన్ స్మూత్ అండ్ టైట్ గా మారుతుంది.బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

మరియు స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా కూడా మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు