ఖమ్మం జిల్లాలో ఆస్తికోసం కన్న కూతురిని హత్య చేసిన తండ్రి..!

ప్రస్తుత సమాజంలో ఆస్తిపాస్తులకు ఇచ్చే విలువ సాటి మనుషులకు ఇవ్వడం లేదు.ఆస్తుల కోసం ఏకంగా కుటుంబ సభ్యుల ప్రాణాలు తీయడానికైనా కొందరు వెనుకాడడం లేదు.

తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ తండ్రి ఆస్తికోసం ఏకంగా కన్న కూతురినే హతమార్చాడు.దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.ఖమ్మం జిల్లా( Khammam District ) వైరా మండలం తాటిపూడి గ్రామంలో పిట్టల రాములు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.ఈయనకు ఉష అనే కుమార్తె ఉంది.

Advertisement

ఉషకు కృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు.కూతురు ఉషకు వివాహం తర్వాత కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి.

తండ్రి కూతురు మధ్య ఆస్తి విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో పిట్టల రాములు ఏకంగా తన కుమార్తె ఉషను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఓ కత్తి తీసుకొని కూతురు ఉష( Usha ) పై దాడి చేశాడు.అయితే ఉషా కడుపులో గట్టిగా కత్తితో పొడవడం వల్ల ఆమె అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.ఇది గమనించిన అల్లుడు కృష్ణ అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై కూడా కత్తితో పిట్టల రాముడు దాడి చేశాడు.

తీవ్ర రక్తస్రావం కావడంతో ఉష అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.అల్లుడు కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే పిట్టల రాములు అక్కడి నుంచి పరారయ్యాడు.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
వైసీపీ కార్యకర్తలకు వైఎస్ జగన్ కీలక సూచనలు..!!

చుట్టుపక్కల ఉండే స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న ఉషా, కృష్ణ లను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు( Police ) సంఘటన స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలైన కృష్ణను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఉషా మృతదేహాన్ని పోస్టుమార్టనికి తరలించారు.పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న పిట్టల రాములు ను గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

తాజా వార్తలు