నిన్న రాత్రి కురిసిన వర్షానికి వట్టెంల గ్రామంలో తీవ్రంగా నష్టపోయిన రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో సుమారు 100 ఎకరాల వరకు నిన్న కురిసిన వడగండ్ల వానకు పూర్తిగా 100% వడ్లు రాలిపోవడం జరిగిందని మండల బిజెపి నాయకులు ఎగుర్ల అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్తూనే రైతుల గొంతు కోస్తోందని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఫసల్ బీమా పథకాన్ని అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తుంటే తెలంగాణలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తూ ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంతో చేతికి వచ్చిన పంట ఈరోజు పూర్తిగా నీళ్లపాలు అయ్యిందని,రైతులు ఆరు నెలలు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నీల్లపాలైంది.

ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ విధానం వల్లే అయ్యింది.దీనికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే బాధ్యత వహించి పంట నష్టం పరిహారం కింద ఎకరాన నష్టపోయిన రైతుకు 25,000 ఇవ్వాల్సిందిగా కోరుతూ

వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించకపోవడం వల్ల వడ్లు పోద్ధమంటే జగలేక వెనుక ముందు కోసుకున్న వారి పరిస్థితి ఈ విధంగా నష్టం జరిగిందన్నారు.ఈ యొక్క పంట నష్టాన్ని మండల అధికారులు, స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు తక్షణమే స్పందించి ఈ యొక్క నష్టానికి పరిహారం చెల్లించాల్సిందిగా కోరుతున్నామన్నారు.లేని పక్షంలో మండల కేంద్రంలో రైతుల పక్షాన ధర్నా చేయడానికి మేము సిద్ధమని అన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News