సోషల్ మీడియాలో సన్ రైజర్స్ జట్టు సభ్యులపై ఫైర్ అయిన ఫ్యాన్స్..!

ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లోనూ చేతులెత్తేస్తూ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అభిమానులను కలవరపెడుతోంది.

ఐపీఎల్‌ 2021 మొదటి నుంచి ఇప్పటి వరకు వరుసగా హ్యాట్రిక్‌ పరాజయాలతో దారుణంగా విఫలమవుతోంది.

సన్ రైజర్స్ జట్టులో టాపార్డర్‌ మినహా, ఎవ్వరూ రాణించలేకపోవడం ఎస్‌ఆర్‌హెచ్‌ విజయావకాశాలను దెబ్బతీసింది.వరుసగా విఫలమవుతున్నా విజయ్‌ శంకర్‌ను నమ్ముకొని జట్టులో చోటివ్వడం చేటు తెచ్చింది.

Fans On Fire On Sunrisers Team Members On Social Media Social Media, Srh, Team,

బ్యాటింగ్‌లో ఏ మ్యాచ్‌లోనూ అతడు ఔరా అనిపించలేకపోతున్నాడు. కేన్‌ విలియమ్సన్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లను తీసుకోకపోవడం జట్టుకు మైనస్‌గా పేర్కొంటున్నారు అభిమానులు.

బౌలింగ్, ఫీల్డింగ్‌ విభాగాల్లోనూ జట్టు మెరుగవ్వాల్సి ఉందంటున్నారు.అవలీలగా గెలిచే మ్యాచ్‌లను చేజార్చుకుంటుండడంపై ఫ్యాన్స్‌ కస్సుమంటున్నారు.

Advertisement

మరో వైపు సన్ రైజర్స్ కు మరో షాక్ తగలనుంది.కరోనా వల్ల ఒకరి తర్వాత ఒకరు ఆస్ట్రేలియా ప్లేయర్స్ వరుసపెట్టి స్వదేశానికి క్యూ కట్టారు.

ప్రస్తుతం భారత్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సాధ్యమైనంత తొందరగా ఇంటికి వెళ్లాలని చూస్తున్నారట.ఇప్పటికే చాలామంది ఆసీస్ ఆటగాళ్లు స్వదేశానికి పయనం కాగా సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఢిల్లీ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా టోర్నీ నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు సమాచారం.

అంతకుముందు, ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు టోర్నమెంట్ నుండి నిష్క్రమించి స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.వీరిలో కెన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా, ఆండ్రూ టై ఉన్నారు.

మరో వైపు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.సన్‌రైజర్స్ జట్టు బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తయింది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్

7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.డేవిడ్ వార్నర్ స్లో బ్యాటింగ్‌ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది.

Advertisement

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ టీమ్ బాండింగ్ సెషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.ఈ యాక్టివిటీలో టీమ్ ప్లేయర్సంతా చిన్న పిల్లల్లా ఇండోర్ గేమ్స్ ఆడారు.

దాగుడు మూతలు, బెలూన్స్, ట్రైన్ ఆటలతో సరదాగా గడిపారు.వీటిని చూసిన ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.

ఓటమి బాధలో తాముంటే మీరు ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసభ్య పదజాలంతో ఆటగాళ్లపై విరుచుకుపడుతున్నారు.

వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతుంటే ఈ పిల్ల ఆటలేందిరా? అని ఒకరు కామెంట్ చేస్తే.ముందు ఆ లచ్చిగాడిని అంటే వీవీఎస్‌ లక్ష్మణ్ను జట్టు నుంచి దొబ్బేయండని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు