క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని!

మనకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే.

మనం వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ ను కలవడం వాళ్లకు సర్ ప్రైస్ ఇవ్వడం వంటివి చేస్తుంటాము.

అంతెందుకు ఎవరైనా నటీనటులు కనిపిస్తే చాలు వెంటనే వెళ్లి సెల్ఫీలు దిగడం మొదలు పెడుతుంటారు.కాగా ఇలాగే ఓ వ్యక్తి తనకు క్రికెటర్ల టీం కనబడగానే వాళ్లకు సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం చోటు చేసుకుంది.

మెల్ బోర్న్ లో ఇండియన్ అభిమాని నవల్ దీప్ సింగ్ అనే వ్యక్తి.ఓ రెస్టారెంట్ లో భోజనం చేస్తుండగా.

తన టేబుల్ కి ఎదురుగా ఇండియన్ క్రికెటర్ టీమ్ భోజనం చేస్తూ కనిపించారు.దీంతో నవల్ దీప్ వాళ్లని చూసి ఆశ్చర్యపోగా వాళ్ళకు ఏదైనా చేయాలి అనుకున్నాడు.

Advertisement
Indian Fan Navaldeep Singh Paid Cricketers Restaurent Bill In Melbourne, Rohit S

బాక్సింగ్ డే టెస్టు లో విజయం సాధించినందుకు విశ్రాంతి కోసం ఇండియన్ క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్, నవదీప్ సైనీ లు న్యూ ఇయర్ సందర్భంగా వాళ్లు కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్లారు.వాళ్లు వాళ్ల టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తుండగా ఎదురుగా ఉన్న అభిమాని నవల్ దీప్ సింగ్ వాళ్ళని చూసి ఆశ్చర్య పోగా.

వాళ్లను వీడియో తీశాడు.కాగా వాళ్ళని కలవడానికి అయినా తన వంతు ప్రయత్నం చేసి తన అభిమానాన్ని చాటి చూపాలనుకొని.దీంతో వాళ్ళ భోజనం పూర్తయే ముందు ఆ అభిమాని కౌంటర్ వద్దకు వెళ్లి క్రికెటర్ల బిల్లు తెలుసుకొని 118 డాలర్లు( రూ.6700) బిల్లు కట్టాడు.కాగా భోజనానంతరం క్రికెటర్లు బిల్లు కట్టుకోవడానికి కౌంటర్ వద్దకు వెళ్లగా ఆ కౌంటర్ మీ బిల్ ఇంతకుముందే పే చేశారంటూ అదిగో ఆ వ్యక్తే అని అభిమాని వైపు చూపాడు.

Indian Fan Navaldeep Singh Paid Cricketers Restaurent Bill In Melbourne, Rohit S

దీంతో రోహిత్ శర్మ,పంత్ లు అతని దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తుంటే అతడు దానిని నిరాకరించి వద్దన్నాడు.మీ మీద ఉన్న అభిమానమే నన్ను ఇలా చేసింది అంటూ.మిమ్మల్ని నేరుగా చూడడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ క్రికెటర్లతో సెల్ఫీ దిగారు.

ఆ ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.రోహిత్,పంత్ తో మిగతా వాళ్ళు అతనికి థాంక్స్ చెప్పారు.అంతేకాకుండా తన భార్య వద్దకు పంత్ వెళ్లి మాకు మంచి లంచ్ గిఫ్ట్ గా అందించినందుకు థాంక్స్ బాబీ అని తెలిపారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!

కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక జనవరి 7న సిడ్నీలో మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు