హ్యూస్టన్ మ్యూజిక్ ఫెస్ట్ విషాదం: ర్యాపర్ ట్రావిస్ స్కాట్‌పై కోర్టుకెక్కిన మృతుల కుటుంబాలు

అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో నవంబర్ 5న జరిగిన మ్యూజిక్‌ ఫెస్టివల్‌ తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.

అక్కడ చోటు చేసుకున్న గందరగోళ పరిస్థితులు, తొక్కిసలాట కారణంగా 9 మంది మరణించగా.

దాదాపు 300మందికి పైగా క్షతగాత్రులయ్యారు.జాకబ్ జురినెక్ (21), జాన్ హిల్గర్ట్ (14), బ్రియానా రోడ్రిగ్జ్ (16), ఫ్రాంకో పాటినో (21), ఆక్సెల్ అకోస్టా (21), రూడీ పెనా (23), మాడిసన్ డుబిస్కీ (23), డానిష్ బేగ్ (27).

భారత సంతతికి చెందిన భారతీ షహానీ (22) ప్రాణాలు కోల్పోయిన వారిలో వున్నారు.ఈ ఘటన బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇంతటి దారుణానికి కారణం ర్యాపర్ ట్రావిస్ స్కాటేనంటూ ఆయనపై భగ్గుమంటున్నారు వారు.ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్ట్‌లో మరణించిన వారిలో చికాగో సబర్బన్‌కు చెందిన ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Families Of 2 Friends Killed At Travis Scott Concert File Lawsuits , Shahani, J

తమ వారి మృతికి ర్యాపర్ ట్రావిస్ స్కాట్, లైవ్ నేషన్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల కుటుంబాలు కోర్టుకెక్కాయి.జాకబ్ ‘‘జేక్’’ జురినెక్ (20), ఫ్రాంకో పాటినో (21)లు హ్యూస్టన్ మ్యూజిక్ ఫెస్ట్‌లో మరణించారు.

పాటినో, జురినెక్ ఇద్దరూ కళాశాల విద్యార్ధులు.ఒహియోలోని డేటన్ యూనివర్సిటీలో పాటినో, సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో జురినెక్ చదువుకుంటున్నారు.

అంతేకాదు వీరిద్దరూ నేపర్‌విల్లేలోని న్యూక్వా వ్యాలీ హైస్కూల్‌ ఫుట్‌బాల్ జట్టులో సహచరులు.మిగిలిన బాధితుల కుటుంబాల్లాగానే వీరి ఫ్యామిలీలు కూడా చికాగో న్యాయసంస్థ కార్బోయ్ అండ్ డెమెట్రియో ద్వారా హ్యూస్టన్‌లోని హారిస్ కౌంటీ కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి.

Families Of 2 Friends Killed At Travis Scott Concert File Lawsuits , Shahani, J

ఇప్పటికే ట్రావిస్, లైవ్ నేషన్‌ కంపెనీలపై వందల కొద్దీ వ్యాజ్యాలు దాఖలవ్వగా.తాజా దావాలోనూ ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.మ్యూజిక్ ఫెస్ట్‌కు హాజరైన వారి ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్వాహకులు ఫెయిల్ అయ్యారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

అలాగే గుంపును నియంత్రించాల్సిన చర్యలు, సరైన బారికేడ్‌లు, భద్రతా సిబ్బందిని నియమించడంలోనూ వైఫల్యమయ్యారని ఆరోపించారు.కాగా.ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్ట్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన భారత సంతతికి చెందిన భారతీ షహానీ అంత్యక్రియలు నవంబర్ 17న అశ్రునయనాల మధ్య ముగిశాయి.

Advertisement

ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు భారతీ కుటుంబసభ్యులు, స్నేహితులు, హ్యూస్టన్‌లోని భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఇంతటి విషాద సమయంలో కూడా భారతీ కుటుంబసభ్యులు ఆమె అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు.

తాజా వార్తలు