భారతసంతతి వ్యక్తికి కళ్ళు చెదిరే దుబాయి లాటరీ

అదృష్టం ఏ క్షణంలో ఎటువైపు నుంచీ వస్తుందో ఎవరికీ తెలియదు అంటారు.

ఒక్కో సారి కూలి పని చేసుకునే వాళ్ళు మిలినియర్స్ గా మారిపోతూ ఉంటారు అలాంటి సంఘటనే దుబాయి లో జరిగింది.

కళ్ళు చెదిరే దుబాయి లాటరీ భారత సంతతి వ్యక్తిని వరించింది.అంతేకాదు అతడితో పాటు లాటరీ గెలుచుకున్న వాళ్ళకి కోట్ల విలువ చేసే వాహనాలని గెలుచుకున్నారు.

అయితే ఈ లాటరీ గెలుచుకున్న భారత సంతతి వ్యక్తీ ఎవరూ ఎంత మొత్తంలో లాటరీ గెలుచుకున్నాడు అనే వివరాలలోకి వెళ్తే.

కేరళకు చెందిన జె.ఐ.చాకో అనే వ్యక్తి సౌదీ అరేబియాలో ఓ ఫార్మా కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు.దుబాయి డ్యూటీ ఫ్రీ వారు నిర్వహించే మిల్లెనియమ్ మిలియనీర్ డ్రాలో దాదాపు 10 లక్షల డాలర్లను గెలుచుకున్నాడు.

Advertisement

ఇప్పటికీ ఇలా గెలుచుకున్న వారిలో చాకో 278వ వ్యక్తి.అయితే ఈ ప్రకటనను మంగళవారం దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో జనాలు ఎక్కువగా ఉండే డి టెర్మినల్ 1 వద్ద లాటరీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు.చాకో లాటరీ నెం.4960 డ్రాలో గెలుపొందడంతో చాకోకు ఫోన్ లో గెలుపొందిన వివరాలు తెలిపారు.

ఎప్పటి నుంచో భారీ మొత్త లాటరీ ద్వారా సంపాదించాలని కలలు కన్న చాకో ఈ వార్తా తెలిసే సరికి సంతోషం పట్టలేక పోయాడు.చాకోతో పాటు మహమ్మద్ అల్‌నాజ్‌దీ అనే వ్యక్తి దాదాపు మూడున్నర కోట్లు విలువ చేసే బెంట్లీ కారును గెలుపొందాడు.ఫ్రెడరిక్ అనే మరో వ్యక్తి రేంజ్ రోవర్ కారును గెలుచుకోగా.

పుష్పరాజ్ మునియూర్ అనే మరో భారతీయుడు బియమ్‌డబ్ల్యూ బైక్‌లను గెలుచుకున్నారు.

ట్రంప్‌ కోసం వైట్‌హౌస్ ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తుందంటే?
Advertisement

తాజా వార్తలు