యూఎఫ్‌సీ వద్ద డొనాల్డ్ ట్రంప్‌కు ఘనస్వాగతం .. కోర్టు దోషిగా తేల్చినా ఈ స్థాయిలో క్రేజా

శనివారం జరిగిన యూఎఫ్‌సీ (ఫైటింగ్ ఛాంపియన్‌షిప్) వద్దకు చేరుకున్న మాజీ అధ్యక్షుడు , రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) వేదిక వద్ద ఘనస్వాగతం లభించింది.

ఆయనకు ప్రేక్షకులంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

హష్ మనీ ట్రయల్‌లో( Hush Money Trial ) ట్రంప్‌ దోషిగా తేలిన కొద్దిరోజులకే ఆయనకు ఈ స్థాయిలో స్వాగతం దొరకడం విశేషం.యూఎఫ్‌సీ అధ్యక్షుడు, తన స్నేహితుడు డానా వైట్‌తో( Dana White ) కలిసి ట్రంప్‌ న్యూజెర్సీలోని నెవార్క్‌లో ఉన్న ‘‘ ది ప్రెసిడెన్షియల్ సెంటర్‌ ’’కు విచ్చేశారు.

పిడికిలి బిగించి ప్రజలకు అభివాదం చేస్తూ, కొద్దిమందితో కరచాలనం చేస్తూ ట్రంప్ ఉత్సాహంగా కనిపించారు.ట్రంప్.

తరచుగా యూఎఫ్‌సీ ఈవెంట్‌లకు హాజరవుతూ మార్షల్ ఆర్ట్స్‌పై అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.తమ స్నేహం 20 ఏళ్ల నాటిదని వైట్ గుర్తుచేసుకున్నారు.

Ex Us President Donald Trump Greeted With Standing Ovation Massive Cheers At Ufc
Advertisement
Ex US President Donald Trump Greeted With Standing Ovation Massive Cheers At UFC

కాగా.హష్ మనీ ట్రయల్‌లో డొనాల్డ్ ట్రంప్‌ను న్యూయార్క్ కోర్ట్( New York Court ) ఇటీవల దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.అతి త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఈ తీర్పు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.స్టార్మీ డేనియల్‌తో( Stormy Daniel ) ట్రంప్ సన్నిహితంగా గడిపారని ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె ఈ సంగతి బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్ భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని , తన లాయర్ ద్వారా స్టార్మీకి సొమ్ము అందజేశారని అభియోగాల్లో పేర్కొన్నారు.ప్రచారం కోసం అందిన విరాళాల నుంచి ట్రంప్ ఈ మొత్తాన్ని కేటాయించారని ఆరోపించారు.

ఇందుకోసం వ్యాపార రికార్డులను తారుమారు చేశారని కూడా ట్రంప్‌పై మొత్తంగా 34 అభియోగాలు మోపారు.మరోవైపు ట్రంప్‌తో తనకు అక్రమ సంబంధం ఉన్నట్లు స్టార్మీ న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు.

Ex Us President Donald Trump Greeted With Standing Ovation Massive Cheers At Ufc

న్యాయస్థానం దోషీగా తేల్చడంతో ట్రంప్ జైలుకెళ్తారా.అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సిందేనా అన్న చర్చ జరుగుతోంది.అయితే దోషిగా తేలినంత మాత్రాన ట్రంప్ అభ్యర్ధిత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదని, గతంలోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు.

దోషిగా తేలి గృహ నిర్బంధాన్ని ఎదుర్కొన్నా వర్చువల్‌గా ట్రంప్ ప్రచారం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు.కోర్టు శిక్ష ఖరారు చేసిన అనంతరం ట్రంప్ దీనిపై పై కోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని అంటున్నారు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు