ఏ భాష అయినా సరే, మాట్లాడాలంటే ముందుగా పద సంపద ఉండాలి.
ఇంగ్లీషు మన దేశంలో హిందీతోపాటు ఒక అఫిషియల్ భాష కావడంతో మనకు ఇంగ్లీషు పదాలతో పరిచయం ఉంది.
ఆ పదాల్ని ఒక వాక్యంలోకి ఎలా చేర్చాలి అనే చోటే సమస్య వస్తుంది.మాట్లాడే అలవాటు లేకపోవడం వలనే ఈ ఇబ్బంది అంతా.
ఇక రెండో విషయం, మనం తెలుగు ఇంతబాగా మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం మనకు కాలక్రియలు తెలిసి ఉండటం.వీటినే ఇంగ్లీషులో Tenses అని అంటారు.
ఉదాహారణగా చెప్పాలంటే .రాము రేపు గ్రౌండ్ కి వెళ్ళి క్రికేట్ ఆడతాడని మనకు తెలుసు .దాన్ని ఓ వాక్యంలో చెప్పాలంటే "రాము రేపు క్రికేట్ ఆడబోతున్నాడు" అని అంటాం అని "రాము రేపు క్రికేట్ ఆడేశాడు" అని చెప్పలేం కదా.ఇలాంటి తప్పులు తెలుగులో ఎందుకు చేయట్లేదు అంటే మనకు కాలక్రియలు తెలుసు కాబట్టి.వర్తమాన, భూత, భవిష్యత్తు కాలల మధ్య వ్యత్యాసం తెలుసు కాబట్టి, ఏ కాలంలో ఎలాంటి "క్రియ" ఉపయోగించాలో తెలుసు కాబట్టి.
ఇవన్ని చదువుకోని వారు కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడటానికి కారణం, చిన్ననాటి నుంచి భాషని వింటూ, మాట్లాడే అలవాటు ఉండటం.అలాంటి వాతావరణం ఇంగ్లీషుకి లేకపోవడం వలనే చిక్కంతా.
అయితే ఇంగ్లీషు మాట్లాడటం, రాయడం మీరు అనుకున్నంత కష్టమైన పనేం కాదు కదా.అందుకే ఇంగ్లీషులోని కాలక్రియలు (tenses) గురించి మీరు తెలుసుకోవాలి .వివరంగా చెబుతున్నాం పూర్తిగా చదవండి.* టెన్సెస్ రకాలు - టెన్సెస్ లో రకాలు ఇంగ్లీషు కాలక్రియలు మూడు రకాలు.
ఒకటి Present Tense (వర్తమాన కాలం), Past Tense (భూత కాలం), Future Tense (భవిష్యత్తు కాలం).ప్రతి టెన్స్ లో నాలుగు సబ్ టెన్స్ ఉంటాయి.
అవే Simple Tense Continuous Tense Perfect Tense Perfect Continuous Tense.ప్రతి సబ్ టెన్స్ లో నాలుగు రకాల వాక్యాలు ఉంటాయి.
అవి Declarative Sentences : స్టేట్మెంట్ ఇవ్వడం Interrogative Sentences: ప్రశ్నించడం Negative Sentences: నెగెటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం Negative Interrogative Sentences: నెగెటివ్ గా ప్రశ్నించడం ఇక ప్రతి వాక్యంలో ప్రథమ పురుష, ద్వితీయ పురుష, తృతియ పురుష ఉంటుంది.వాటిని బట్టి వాక్యంలో helping verbs మరియు క్రియ పలికే విధానం మారిపోతుంది.
మరి వాటి ఊదాహరణలు ఇటు ఇంగ్లీషులో, అటు తెలుగులో చూద్దామా ? అప్పుడైతే మీకు ఎలాంటి సందర్భంలో ఎలాంటి వాక్యం వాడాలో అర్థం అవుతుంది.
Declarative Sentence - I play cricket :నేను క్రికేట్ ఆడతాను Interrorgative Sentence - Do I play cricket? :నేను క్రికేట్ ఆడతానా ? Negative Sentence - I do not play cricket : నేను క్రికేట్ ఆడను Negative Interrogative Sentence : Dont I play cricket? : నేను క్రికేట్ ఆడనా ?
Declarative - I am playing cricket : నేను క్రికేట్ ఆడుతున్నాను Interrogative - am I playing cricket?:నేను క్రికేట్ ఆడుతున్నానా ? Negative - I am not playing cricket : నేను క్రికేట్ ఆడట్లేదు Negative Interrogative - am I not playing Cricket? :నేను క్రికేట్ ఆడట్లేదా ?
Declarative - I have played cricket : నేను ఇందాకే క్రికేట్ ఆడాను Interrogative - Have I played cricket? : నేను ఇందాకే క్రికేట్ ఆడానా? Negative - I have not played cricket : నేను ఇందాక క్రికేట్ ఆడలేదు Negative Interrogative - Have I not played Cricket? : నేను ఇందాక క్రికేట్ ఆడలేదా ?
Declarative - I have been playing cricket since morning : నేను ఉదయం నుంచి క్రికేట్ ఆడుతున్నాను Interrogative - Have I been playing cricket since morning? : నేను ఉదయంనుంచి క్రికేట్ ఆడుతున్నానా ? Negative - I have not been playing cricket since morning : నేను ఉదయం నుంచి క్రికేట్ ఆడట్లేదు Negative Interrorgative - Have I not been playing cricket since morning? : నేను ఉదయం నుంచి క్రికేట్ ఆడట్లేదా ?
Declarative - I played cricket yesterday : నేను నిన్న క్రికెట్ ఆడాను Interrorgative - Did I play cricket yesterday? : నేను నిన్న క్రికేట్ ఆడానా ? Negative - I did not play cricket yesterday : నేను నిన్న క్రికెట్ ఆడలేదు Negative Interrogative - Did not I play cricket yesterday?: నేను నిన్న క్రికెట్ ఆడలేదా ?
Declarative - I was playing cricket by this time yesterday : నేను నిన్న ఈ సమయానికి క్రికేట్ ఆడుతూ ఉన్నాను Interrorgative - Was I playing cricket by this time yesterday? : నేను నిన్న ఈ సమయానికి క్రికేట్ ఆడుతూ ఉన్నానా ? Negative - I was not playing cricket by this time yesterday : నేను నిన్న ఈ సమయానికి క్రికేట్ ఆడుతూ లేను Negative Interrogative - Was I not playing cricket by this time yesterday? : నేను నిన్న ఈ సమయానికి క్రికేట్ ఆడుతూ లేనా ?
Declarative - I had played cricket long ago : నేను చాలాకాలం క్రితం క్రికేట్ ఆడాను Interrorgative - Had I played cricket long ago?: నేను చాలాకాలం క్రితం క్రికేట్ ఆడానా ? Negative - I had not played cricket long ago : నేను చాలాకాలం క్రితం క్రికెట్ ఆడలేదు Negative Interrogative - Had I not played cricket long ago : నేను చాలాకాలం క్రితం క్రికేట్ ఆడలేదా ?
Declarative - I had been playing cricket before chess : నేను చెస్ కి ముందు క్రికేట్ ఆడేవాడిని Interrogative - Had I been playing cricket before chess: నేను చెస్ కి ముందు క్రికేట్ ఆడేవాడినా ? Negative - I had not been playing cricket before chess : నేను చెస్ కి ముందు క్రికేట్ ఆడేవాడిని కాదు Negative Interrogative - Had I not been playing cricket before chess? : నేను చెస్ కి ముందు క్రికేట్ ఆడేవాడిని కాదా?
Declarative - I will play cricket tomorrow : నేను రేపు క్రికేట్ ఆడతాను Interrogative - Will I play cricket tomorrow? : నేను రేపు క్రికెట్ ఆడతానా ? Negative - I will not play cricket tomorrow : నేను రేపు క్రికెట్ ఆడను Negative Interrogative - Will I not play cricket tomorrow? : నేను రేపు క్రికెట్ ఆడనా ?
Declarative - I will be playing cricket cricket tomorrow by this time : నేను రేపు ఈ సమయానికి క్రికెట్ ఆడుతూ ఉంటాను Interrogative - Will I be playing cricket tomorrow by this time? : నేను రేపు ఈ సమయానికి క్రికేట్ ఆడుతూ ఉంటానా ? Negative - I will not be playing cricket tomorrow by this time : నేను రేపు ఈ సమయానికి క్రికేట్ ఆడుతూ ఉండను Negative Interrogative - Will I not be playing cricket tomorrow by this time ? : నేను రేపు ఈ సమయానికి క్రికేట్ ఆడుతూ ఉండనా?
Declarative - I will have played cricket by this time tomorrow : నేను రేపు ఈ సమయానికి క్రికేట్ ఆడేసి ఉంటాను Interrogative - Will I have played cricket by this time tomorrow : నేను రేపు ఈ సమయానికి క్రికెట్ ఆడేసి ఉంటానా? Negative - I will not have played cricket by this time tomorrow : నేను రేపు ఈ సమయానికి క్రికెట్ ఆడేసి ఉండను Negative Interrogative Will I not have played cricket by this time tomorrow? : నేను రేపు ఈ సమయానికి క్రికేట్ ఆడేసి ఉండనా?
Declarative - I will have been playing cricket tomorrow from morning to evening : నేను రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా క్రికెట్ ఆడుతూ ఉంటాను Interrogative - Will I have been playing cricket tomorrow from morning to evening? : నేను రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా క్రికెట్ ఆడుతూ ఉంటానా? Negative - I will not have been playing cricket tomorrow from morning to evening : నేను రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా క్రికెట్ ఆడుతూ ఉండను Negative Interrogative - Will I not have been playing cricket tomorrow from morning to evening? : నేను రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా క్రికెట్ ఆడుతూ ఉండనా ?.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy