వీధిలో విద్యుత్ స్తంభానికి కరెంట్ సరఫరా...పాడి గేదె మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలోని హుస్సేనాబాద్ లో గురువారం తెల్లవారుజామున వీధిలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తగిలిన పాడి గేదే విద్యుత్ షాక్ తో అక్కడిక్కడే మృత్యువాత పడింది.

బాధితుడు తుమ్మెటి అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.

తమ పాడి గేదె తెల్లవారుజామున మేత కోసం విడిచిపెట్టగా దారిలోని మున్సిపల్ మోటార్ వద్ద విద్యుత్ స్తంభానికి ( Electric pole )తగులుతూ వెళ్లడంతో షాక్ కి గురై చనిపోయింది.బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మున్సిపల్ మోటార్ బిగించిన స్తంభానికి కరెంటు సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగింది.

పాడి గేదె విలువ సుమారు లక్షా యాభైవేలు వరకు వుంటుందన్నారు.ప్రజలు ఎవరూ అటు పోకుండాఉండడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు వాపోయారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల కోలాహలం
Advertisement

Latest Yadadri Bhuvanagiri News