కంటి సమస్యలకు అద్భుతమైన చిట్కాలు

నేటి బిజీ జీవనశైలిలో ఎన్నో ఆనారోగ్య సమస్యల బారిన పడుతున్నాడు మనిషి.వాటిలో ముఖ్యమైనది కంటి సమస్యలు.

ప్రతి రోజు లాప్ టాప్ ల ముందు కూర్చొని పనిచేసేవారు,ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడేవారు కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది.అలాగే కొంత మందికి కంటి నుండి నీరు కారటం మరియు పొడిబారటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తే కంటి సమస్యల నుండి బయట పడవచ్చు.

Effective Tips For Eye Problems

ఒక పరిశుభ్రమైన వస్త్రాన్ని తీసుకోని గోరువెచ్చని నీటిలో ముంచి కనురెప్పల మీద పెట్టి 15 నిముషాలు అలాగే ఉంచాలి.ఆ తర్వాత నిదానంగా కంటి లోపల కూడా శుభ్రం చేయాలి.ఈ విధంగా చేయటం వలన కంటి లోపల దుమ్ము,ధూళి అన్ని తొలగిపోతాయి.

Advertisement
Effective Tips For Eye Problems-కంటి సమస్యలకు అద్

అలాగే కంటిలో నీటి ఉత్పత్తి పెరగటంతో పొడిబారటం తగ్గుతుంది.కొబ్బరి నూనెలో ముంచిన కాటన్ బాల్ ని మూసిన కనురెప్పపై 15 నిమిషాల పాటు ఉంచాలి.

ఇలా చేయటం వలన కళ్ళకు మంచి రిలీఫ్ కలుగుతుంది.ఈ విధంగా రోజులో ఎన్నిసార్లయినా చేయవచ్చు.

అలోవెరా జెల్ ని కళ్ళను మూసి కనురెప్పలపై రాసి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.అలోవెరాలో తేమ లక్షణాలు, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన కంటిలో దురద,మంట వంటివి తగ్గుతాయి.

మనం తీసుకొనే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి.ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా లభించే చేప‌లు, అవిసె గింజెలు, వాల్ న‌ట్స్ వంటి ఆహార ప‌దార్థాల‌ను తింటే త‌ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మ‌న‌కు ఎక్కువగా ల‌భిస్తాయి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
కేరళలో నిఫా వైరస్.. రంగంలోకి కేంద్ర బృందం

దీంతో కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.అలాగే విట‌మిన్ ఎ ఉన్న యాపిల్‌, టమాటా, పాల‌కూర వంటి ఆహారాల‌ను తింటున్నా కంటి స‌మ‌స్య‌ల బారి నుంచి సమర్ధవంతంగా త‌ప్పించుకోవ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు