ఉద్యోగులకు కంపెనీలు కంపల్సరీగా కొన్ని రూల్స్ పెడతాయన్న సంగతి అందరికీ విదితమే.అయితే, రూల్స్ ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మధ్య వేరేలా ఉంటాయి.
అన్ని కంపెనీలకు ఒకే రూల్స్ అయితే ఉండబోవు.ఆఫీసుకు ఎన్ని గంటలకు రావాలి, ఏ విధమైన డ్రెస్సింగ్ ఉండాలి, ఇంకా తదితర విషయాలపై సర్టెన్ రూల్స్ ఉంటాయి.
ఒకవేళ ఉద్యోగులు ఆ రూల్స్ ఫాలో కాకపోతే ఆయా సంస్థలు ఉద్యోగులపై కఠినమైన చర్యలు తీసుకునే చాన్సెస్ ఉంటాయి.కాగా, ఏ ఆఫీసులోనైనా మద్యం తాగి వెళ్లడం ఉల్లంఘనే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కాగా, ఓ మహిళా ఉద్యోగిని ఆఫీసుకు మద్యం తాగి వెళ్లిందన్న కారణంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.అయితే, ఈ విషయమై సంస్థను ప్రశ్నిస్తూ ఆమె కోర్టుకు వెళ్లి తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరింది.
ఇంతకీ అసలేం జరిగిందంటే స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో ఈ ఘటన జరిగింది.షిఫ్ట్‌కి తొమ్మిది గంటల ముందర మద్యం తాగినందుకుగాను మాల్గోర్జాటా క్రోలిక్ అనే మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసేశారు.
ఆఫీసుకు వెళ్లిన క్రమంలో మద్యం వాసన రాగా, చెక్ చేసి మద్యం తాగిందని ధ్రువీకరించారు.
అయితే, ఆమె తన 2 గంటల షిఫ్ట్‌కు తొమ్మిది గంటల ముందర అంటే ఆ రోజు ఉదయం 5 గంటల సమయంలో మద్యం తాగిందట.
సదరు కంపెనీ ఆల్కహాల్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీ ఉన్న కంపెనీ కాగా, లిక్కర్ స్మెల్ రావడంతో ఉద్యోగం నుంచి తీసేశారు.అయితే, 11 ఏళ్ల నుంచి ఆ కంపెనీలో పని చేస్తున్న సదరు మహిళ కంపెనీ నిర్ణయాన్ని ప్రశ్నించింది.

కంపెనీ మేనేజర్‌కు బ్రీఫింగ్ సమయంలో తాను మద్యం తాగుతానని చెప్పానని పేర్కొంది.తాను షిఫ్ట్‌కు 9 గంటల ముందర మద్యం తాగానని తన వాదనని వినిపించింది.మహిళా చట్టం ప్రకారం కోర్టుకు వెళ్లింది.కోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.సదరు మహిళకు పరిహారంగా 5454 యూరోలు అంటే సుమారు రూ.5 లక్షల 50 వేలు ఇవ్వాలని కోర్టు కంపెనీని ఆదేశించింది.దాంతో ఆ కంపెనీ కోర్టు చెప్పినట్లుగా నష్టపరిహారం ఇచ్చింది.ఈ విషయం తెలుసుకుని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.