హిందీలో రీమేక్ కానున్న మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఫుల్ లెంత్ కామెడీ పండించిన సినిమా అంటే వెంటనే గుర్తుకొచ్చేది దూకుడు.

ఆ సినిమా ముందు వరకు మహేష్ బాబు అంటే ప్రేక్షకులు ఎక్కువగా సీరియస్ రోల్స్ లోనే చూసేవారు.

అయితే త్రివిక్రమ్ ఖలేజా సినిమాతో అతని స్టైల్ పూర్తిగా మార్చేసి మహేష్ బాబులో ఉండే కామెడీ టైమింగ్ ప్రేక్షకులకి పరిచయం చేశారు.అయితే ఖలేజా సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా మహేష్ బాబు కామెడీ చేస్తూ కనిపించడంతో ఆ సినిమా ప్రేక్షకులకి రీచ్ కాలేదు.

అయితే అదే కామెడీ టైమింగ్ తో ఈ సారి శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు దూకుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.అప్పటి వరకు ఒకే రకమైన పాత్రలలో మహేష్ బాబుని చూసిన ప్రేక్షకులకి దూకుడులో మహేష్ కొత్తగా కనిపించాడు.

సరదాగా ఉంటూ రౌడీలపై పంజా విసిరే పోలీస్ ఆఫీసర్ పాత్రలో, మరో వైపు తండ్రిని కాపాడుకోవడానికి పరితపించే కొడుకుగా ఎమ్మెల్యే పాత్రలో మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో సందడి చేశాడు.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది.

Advertisement

  ఈ సినిమాలో సమంత మహేష్ బాబుకి జోడీగా కనిపించింది.అయితే 2011లో వచ్చిన ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

  ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమాలో హీరో ఎవరు, దర్శకుడు ఎవరనే విషయాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన శ్రీనువైట్లని ఈ సినిమా కోసం తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 15, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు