తప్పుడు ఫిర్యాదులతో తప్పుదోవ పట్టించవద్దు: లోకయుక్త ఇన్వెస్టగేషన్ అధికారి మాత్యూ కొషీ

సూర్యాపేట జిల్లా:సరైన అవగాహన లేకుండా ఫిర్యాదులు చేసి వ్యవస్థలను తప్పుదారి పట్టించి,సమయాన్ని వృథా చెయ్యొద్దని తెలంగాణ రాష్ట్ర లోకయుక్త ఇన్వేస్టగేషన్ అధికారి మాత్యూకొషి అన్నారు.

సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని రాఘవాపురం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న క్వారిపై నడి గూడెం మండలం చాకిరాల గ్రామానికి చెందిన మాతంగి యేసుబాబు పలుమార్లు పిర్యాదు చేయడంతో విచారణ కోసం వచ్చిన ఆయన క్వారీ నిర్వహణలో ప్రభుత్వం కల్పించిన ప్రతి నియమ నిబంధనలను పరిశీలించిన అనంతరం రికార్డులు అనుమతి పత్రాలు,కాలుష్య నియంత్రణ పద్ధతులు మైనింగ్ లీజు గడువు భూమిపట్టా సర్వే నంబర్లు క్వారీ చుట్టు ఉన్న రైతుల నుంచి వివరాలు సేకరించి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి క్వారీ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

బ్లాస్టింగ్ సమయంలో చుట్టూ ఉన్న రైతుల భూములు రాళ్ళు పడుతున్నాయా అని అడిగారు.క్వారీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వానికి కట్టవలసిన ప్రతి టాక్సీ బకాయిలు లేకుండా చెల్లించడం జరుగుతుందని తేల్చారు.

Don't Be Misled By False Complaints Lokayukta Investigation Officer Mathew Koshy

తప్పులు జరిగే చోట ఖచ్చితంగా అడగాలని సూచిస్తూ,తప్పుడు ఫిర్యాదులతో అధికారుల సమయం వృధా చేయవద్దని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో లోకయుక్త అధికారుల బృందం శివప్రసాద్,రాంరెడ్డి మైనింగ్ అధికారులు విజయరామరాజు,సర్వేయర్ వెంకటేశ్వర్లు, లావణ్య,పొల్ల్యూషన్ బోర్డు అధికారులు శంకరన్, తహసీల్దార్ సంఘమిత్ర, డిప్యూటీ తహసీల్దార్ సూరయ్య,అర్ఐ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పిన బండ్ల గణేష్.. అసలేం జరిగిందంటే?
Advertisement

Latest Suryapet News