మకర సంక్రాంతి రోజు వీటిని దానం చేస్తే.. మీకు పట్టిన శని దూరమవాల్సిందే..?

ముఖ్యంగా చెప్పాలంటే నెల రోజులకు ఒకసారి రాశిలో సంచరించే సూర్యుడు, ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి అడుగుపెట్టినప్పుడు జరుపుకునే పండుగనే మకర సంక్రాంతి( Makara Sankranti ) అని అంటారు.

మకర రాశికి అధిపతి శని దేవుడు, సూర్య భగవానుడి కుమారుడు.

అందుకే సంక్రాంతి రోజు కొన్ని నియమాలు పాటించడం వల్ల జాతకంలో శని ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు తన దిశ మార్చుకున్నప్పుడు తన కుమారుడైన శనితో( Shani ) కలిసి దాదాపు నెల రోజులు ఉంటాడని పండితులు చెబుతున్నారు.

ఆ నెల రోజులు సూర్యుడు తేజస్సు, ముందు శని తేజస్సు మసక మారిపోతుంది.అంటే శని ప్రభావం తగ్గిపోతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే పురాణాలలో చెప్పిన విషయాల ప్రకారం సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానుడికి( Surya Bhagavan ) శని తనకి ఇష్టమైన నువ్వులతో స్వాగతం పలుకుతాడు.సంతోషించిన సూర్యుడు ఈ రోజున ఎవరైతే తనకు నల్ల నువ్వులు( Black Sesame ) సమర్పిస్తారో వారికి శని బాధలు తొలగి సుఖసంతోషాలతో, ఐశ్వర్యాలతో వర్థిల్లుతారని వరమిస్తాడు.

Donate Black Sesame On Makar Sankranti To Get Rid Of Shani Effect Details, Donat
Advertisement
Donate Black Sesame On Makar Sankranti To Get Rid Of Shani Effect Details, Donat

అందుకే ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు సూర్యుడి పూజలకు నల్ల నువ్వులు ఉపయోగిస్తారని పండితులు చెబుతున్నారు.అలాగే సూర్యుడికి, శనికి ఇష్టమైన నల్ల నువ్వులను సంక్రాంతి రోజు ధారపోసిన, దానమిచ్చిన శని బాధల నుంచి ఉపశమనం లభించి వారి జీవితంలో కొత్త వెలుగులు వస్తాయని చెబుతున్నారు.అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు చేసే దానం పూజకు రెట్టింపు ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

Donate Black Sesame On Makar Sankranti To Get Rid Of Shani Effect Details, Donat

అందుకే సంక్రాంతి రోజు( Sankranti ) సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, స్నానమాచరించి, నల్ల నువ్వులు కలిపిన నీటిని సూర్య భగవానుడికి సమర్పించాలి.ఆ తర్వాత శనిని తలుచుకొని నల్ల నువ్వులు సమర్పించాలి.అలాగే పూజ పూర్తయిన తర్వాత ఆవనూనె, నల్ల నువ్వులు,నువ్వుల లడ్డు ఎవరికైనా దానం ఇచ్చిన శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు