అడవిలో యజమాని చనిపోతే పక్కనే ఉండి కాపాడిన కుక్క...

కొలరాడోకు( Colorado ) చెందిన 71 ఏళ్ల వ్యక్తి రిచ్ మూర్( Rich Moore ) ఇటీవల సమ్మర్ ట్రిప్‌లో భాగంగా తన కుక్క ఫిన్నీతో( Finney ) కలిసి బయలుదేరాడు.

ఆ తర్వాత రెండు నెలలుగా అతని నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.

మిస్సయిన తర్వాత అతడు పర్వతంపై శవమై కనిపించాడు.శాన్ జువాన్ పర్వతాలలో ఉన్న 12,500 అడుగుల శిఖరమైన బ్లాక్‌హెడ్ శిఖరాన్ని( Blackhead Peak ) అధిరోహించడానికి అతను తన ఇంటి నుంచి బయలుదేరాడు.

ఆగస్టు 19న చివరిసారిగా కనిపించాడు.

శిఖరానికి ఆగ్నేయంగా దిగువ బ్లాంకో నది పరీవాహక ప్రాంతంలో ఒక వేటగాడు తిరుగుతుండగా అక్కడ మూర్ మృతదేహం అనిపించింది.ఆ డెడ్ బాడీ పక్కనే ఫిన్నీ రోదిస్తూ కనిపించింది.ఈ వైట్ డాగ్ "జాక్ రస్సెల్ టెర్రియర్"( Jack Russell Terrier ) జాతికి చెందినది.

Advertisement

మరుసటి రోజు, హెలికాప్టర్ టీమ్ మూర్ మృతదేహాన్ని వెలికితీసింది.ఆపై ఫిన్నీని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు.

ఫిన్నీ తర్వాత మూర్ కుటుంబ సభ్యుల వద్దకు చేరింది.కానీ ఇప్పటికే అది చాలా బాధలో ఉందని లోకల్ మీడియా తెలిపింది.

ఆర్చులేటా కౌంటీ షెరీఫ్ ఆఫీస్ అధికారులు మూర్ మరణాన్ని అనుమానించడం లేదని తెలిపారు.కానీ అతని మరణానికి వారు కారణాన్ని వెల్లడించలేదు.చనిపోయిన హైకర్ దగ్గర ఒక కుక్క( Dog ) ప్రాణాలతో బయటపడటం ఏడాదిలో ఇది మూడో కేసు.

అరిజోనాలో,( Arizona ) 74 ఏళ్ల వ్యక్తి మరణించిన తర్వాత అతని మృతదేహం పక్కనే లాబ్రడార్ కనుగొనబడింది.ఇక లాస్ ఏంజిల్స్‌లో, గ్రిఫిత్ పార్క్‌లో 29 ఏళ్ల హైకర్ చనిపోయి పడిపోగా అతడు పక్కనే కుక్క రెండు వారాల పాటు ఉంది.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు