Dog javan : జవాన్ ట్రైనింగ్‌లో కసరత్తులు చేస్తున్న శునకం.. వీడియో వైరల్

ఈ ప్రపంచంలో విశ్వాసానికి మారుపేరుగా కుక్కలు అని చెబుతారు.ఏ మాత్రం మచ్చిక చేసుకున్నా, అవి మనకు చాలా అలవాటు పడిపోతాయి.

చివరికి ఇంట్లో కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసి పోతాయి.ఇక అవి లేకపోతే మనం ఉండలేనంత దగ్గర అవుతాయి.

ఇక కుక్కలను చాలా మంది ఇంటికి కాపలాగా వాడుతుంటారు.ఎవరైనా దొండలు పడినా, ఏదైనా ప్రమాద పరిస్థితులు వచ్చిన కుక్కలు ప్రాణాలకు తెగించి పోరాడతాయి.

అందుకే కుక్కలను చాలా మంది పెంచుకుంటుంటారు.ఇక సైనికులు, పోలీసులు కూడా నేర పరిశోధనలో కుక్కలను వినియోగిస్తుంటారు.

Advertisement

వాటికి చాలా కఠిన మైన ట్రైనింగ్ అందిస్తుంటారు.ఇక కుక్కలు కూడా చాలా చక్కగా శిక్షణ పొందుతాయి.

ట్రైనర్ తమకు చెప్పినవి తూచా తప్పకుండా పాటిస్తాయి.తాజాగా ఇదే తరహాలో ఓ కుక్క ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.పెంపుడు జంతువుగానే కాకుండా కుక్కలు సైనిక, పోలీసు సేవల్లో అవి ముఖ్యమైన పాత్ర పోషించాయి.

సైన్యం, పోలీసు, ఇతర భద్రతా దళాలలోని డాగ్ స్క్వాడ్‌ల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.ఇక స్నిఫర్ డాగ్ స్క్వాడ్ అనేది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) యూనిట్‌లో భాగం.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

ఇది ఢిల్లీలోని మెట్రో స్టేషన్‌లలో భద్రతను నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారు.

Advertisement

వాటికి చాలా కఠినమైన శిక్షణ అందిస్తుంటారు.ఈ క్రమంలో ఒక కుక్క CISF సైనికుడి వ్యాయామాన్ని అనుకరిస్తున్నట్లు చూపించే వైరల్ వీడియో పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాగ్ లవర్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు.నవంబర్ 6న “భారత్ డిఫెండర్స్” ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

CISF జవాన్ ఢిల్లీ మెట్రోస్టేషన్‌లో ఓ చోట వర్కవుట్స్ చేస్తుండగా, ఓ కుక్క కూడా అతడిని అనుకరిస్తుంది.ఈ వీడియో ఆన్‌లైన్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

ఐదు రోజుల్లో, ఈ వీడియోకు 19,000 ఇన్‌స్టాగ్రామ్ వ్యూస్ వచ్చాయి.

తాజా వార్తలు