Debina Bonnerjee Gurmeet Chaudhary: ఏడు నెలల్లోనే రెండో బిడ్డకు జన్మనిచ్చిన రామాయణం సీరియల్ హీరోయిన్?

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో పాటు అభిమానులతో తరచుగా ముచ్చటిస్తూ ఉన్నారు.అంతేకాకుండా వారి సినిమాలకు, సీరియల్ కు సంబంధించిన విషయాలతో పాటు వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకోడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.

 Actors Debina Bonnerjee Gurmeet Chaudhary Welcomed Their Second Child On Novembe-TeluguStop.com

కేవలం వెండితెర సెలబ్రిటీలు మాత్రమే కాకుండా బుల్లితెర సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక హీరోయిన్ కి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రామాయణం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన దెబీనా బొనర్జీ గురించి మనందరికీ తెలిసిందే.అమ్మాయిలు అబ్బాయిలు అనే సినిమాతో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

అయితే అప్పటికే రామాయణం సీరియల్ తో పాటుగా పలు హిందీ సీరియల్స్ నటిస్తూ బిజీ బిజీగా ఉండడంతో తెలుగు సినిమాలలో నటించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే ఈమె రామాయణంలో రాముడిగా నటించిన గుర్మీత్ చౌదరిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

రీల్ లైఫ్ లో రాముడు సీతగా నటించిన వీరిద్దరూ రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

కాగా మొదటి 2011లో పెళ్లి చేసుకున్న గుర్మీత్,దెబీనా ఆ తర్వాత మళ్లీ 2021లో పెళ్లి చేసుకున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ లో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది దెబీనా.దీంతో అభిమానులు ఆ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

మొదటి బిడ్డలోనే రెండో బిడ్డకు జన్మదివ్వడం అన్నది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఈనెల నవంబర్ 11న మరోసారి రెండో పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది.

సందర్భంగా రెండవ బిడ్డ పుట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ రెండో కుమార్తెకు సంబంధించిన ఫోటోలు వివరాలు సీక్రెట్ గా ఉంచుతాం అని ఇంస్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube