దేవుడా.. తల్లి గర్భంలో ప్లాస్టిక్ వ్యర్ధాలను గుర్తించిన డాక్టర్లు..!

భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడని చెబుతూ ఉంటారు.

అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు కూడా అదే వర్తిస్తుంది అని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది.

వివిధ రూపాలలో పర్యావరణాన్ని రక్షిస్తున్న ప్లాస్టిక్ ప్రస్తుతం మానవ మనుగడకే చాలా ప్రశ్నార్థకం కరమైన విషయంగా మారింది.ఈ తరుణంలో డాక్టర్లు మరొక షాకింగ్ విషయాన్ని గుర్తించారు.

తల్లి గర్భంలో కూడా వైద్యులు మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు.తల్లిని గర్భస్థ శిశువుతో కలుపుతూ బిడ్డకు పోషక పదార్థాలు అందించే ప్లాసెంటాలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు వారు వైద్యులు గుర్తించారు.

అలాగే శిశువుకు చుట్టూ రక్షణగా ఉండే పొరలో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉన్నట్లు వారు గ్రహించారు.ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఎరుపు, నీలం, నారింజ రంగులలో ఉన్నాయని.

Advertisement
Microplastics Found In Placenta Of Pregnant Woman, Pregnant Woman, Microplastics

ఇవి ప్యాకింగ్ కు ఉపయోగించే ప్లాస్టిక్, పెయింట్లు, కాస్మెటిక్స్ ద్వారా గర్భిణీ స్త్రీల శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చని వైద్యలు ఓ అంచనా వేస్తున్నారు.అయితే ఇప్పటి వరకు ఈ విషయానికి సంబంధించి ఇటువంటి రుజువులు మాత్రం వారికి లభించలేదు.

ఈ అధ్యయనాన్ని రోమ్‌ లోని శాన్ జియోవానీ క్యాబిలిటా హాస్పిటల్ వైద్య అధికారులు చేపట్టారు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక ప్రముఖ జనరల్ లో ఇటీవలే ప్రచురితం అయ్యింది.

Microplastics Found In Placenta Of Pregnant Woman, Pregnant Woman, Microplastics

ఇక గర్భస్త శిశువుకు ఎదుగుదలలో ఒక కీలక పాత్ర పోషించే ప్లాసెంటాలో ఈ ప్లాస్టిక్ ఉండడం కాస్త ఆందోళన కలిగించే విషయమని వైద్య అధికారులు తెలియజేస్తున్నారు.ఈ మైక్రో ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా ముప్పు ఏర్పడుతుంది.ఇక వీటి పై చాలా రకాల హానికర రసాయనాలు ఉండడంతో కొన్ని కొన్ని సందర్భాలలో క్యాన్సర్ వ్యాధికి కూడా ఇది దారితీయవచ్చు అని వైద్యులు పేర్కొంటున్నారు.

ఈ మైక్రో ప్లాస్టిక్ చాలా సూక్ష్మమైనవి కావడంతో రక్త ప్రవాహం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చు అని వారి భావన వ్యక్తం చేస్తున్నారు.ఇలా మైక్రో ప్లాస్టిక్స్ ఉండడం వల్ల శిశువుకు అనేక దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వారు తెలుపుతున్నారు.

డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..
Advertisement

తాజా వార్తలు