National Awards: మమ్ముట్టి, మోహన్ లాల్, కమల్ లాంటి వాళ్ళకేనా తెలుగు వారికి జాతీయ అవార్డు సాధించే సత్తా లేదా ?

తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారు సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు మీడిల్ రేంజ్ హీరోలు అప్కమింగ్ హీరోలు అంటూ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఏది ఏమైనా అందరి అంతిమ లక్ష్యం సినిమా హిట్ అవ్వడమే అయితే ఒక సినిమా హిట్ అవుతూనే సరిపోతుందా ? ఆ సినిమాలో నటించే స్టార్ హీరో రేంజ్ పెంచుకోవడం కోసం లేదా కలెక్షన్స్ సునామీ సృష్టించుకోవడం కోసం అభిమానులను నేర్పించుకోవడం కోసం సినిమాలో తీస్తూనే వెళ్తారా కథలో కొత్తదనం కోసం ప్రయత్నించే అవకాశం లేదా అంటే అవును అనే సమాధానం వస్తుంది.ఇప్పటివరకు చిరంజీవి,( Chiranjeevi ) వెంకటేష్,( Venkatesh ) బాలకృష్ణ,( Balakrishna ) నాగార్జున( Nagarjuna ) వంటి స్టార్ హీరోలు ఎవరికీ కూడా ఒక్కటంటే ఒక్క నేషనల్ అవార్డు( National Award ) దక్కకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తెలుగు ఇండస్ట్రీలో కథల కొరత ఎక్కువ.అందుకే ఉన్న నాలుగు స్టోరీలను అటు తిప్పి ఏదో స్క్రీన్ ప్లే తో కనిపించకుండా కవర్ చేసి విడుదల చేస్తున్న కూడా ప్రేక్షకుల చేతికి దొరికిపోతున్నారు.అందుకే భారీ బడ్జెట్ చిత్రాలు సైతం పరాజయం అందుకొక తప్పడం లేదు.

మరి మన స్టార్ హీరోలు అందరికీ ఇప్పటి వరకు కొత్త కథతో వచ్చే ఇంట్రెస్ట్ కూడా లేదు.ఎందుకంటే అభిమానులు ఒప్పుకోరు అనే ఒక కారణం చూపించి కుర్ర దర్శకులను పక్కన పెడుతూ సక్సెస్ ఉన్న సీనియర్ దర్శకులను( Senior Directors ) నమ్ముకుని పాత చింతకాయ పచ్చడిని మన ముఖానికి రుద్దుతున్నారు.

మరి వేరే భాషల్లో హీరోలు విజయాలను అందుకుంటూనే అవార్డులను కూడా అందుకుంటున్నారు ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తిస్తారు మన తెలుగు హీరోలు.

Advertisement

సక్సెస్ మంత్ర( Success Mantra ) అని కమర్షియల్ ఫార్ములా వెనుకబడి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి మరోవైపు అవార్డులు కూడా దక్కడం లేదు.50 ఏళ్లకు పైగా సినిమాలు తీస్తున్న మన హీరోలకు ఒక్క దమ్మున్న సినిమా తీయడం కష్టమవుతుంది అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి.అలా రొట్టె కథలతో సినిమాలు తీసి ఆ ఫెయిల్యూర్ ని దర్శకుడు పైకి తోస్తూ మరొక సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వెళుతున్నారు.

పద్మా అవార్డ్స్ లభిస్తున్న, ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెలుస్తున్న అవేమీ కూడా జాతీయ అవార్డు వస్తే బాగుంటుంది అని ఆ హీరోల ఫ్యాన్స్ కూడా కోరుకోవాలి.

Advertisement

తాజా వార్తలు