అలనాటి హీరోయిన్ టబు రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అందుకే టాలీవుడ్ కు దూరం?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు గురించి అందరికీ పరిచయమే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

తన అందంతో మాత్రం అప్పటి కుర్రాళ్లను తన వలలో వేసుకుంది.ఇక ఈమె తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, మలయాళ, తమిళ, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ ఇలా అన్ని భాషలలో నటించి టాక్ అఫ్ ది ఇండస్ట్రీస్ గా మారింది.

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తుంది.టబు సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా బాలనటిగా అడుగు పెట్టింది.

ఇక 1991లో కూలి నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమై తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది.

Advertisement

ఏడాదికి దాదాపు ఐదారు వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది.మొత్తం 75 కి పైగా సినిమాలలో నటించిన టబు ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల్లోనే అవకాశాలు అందుకుంది.

ఈమె ఇప్పటికీ లేటు వయసులో ఉన్నా కూడా చెరగని అందంతో కనిపిస్తుంది.ఇక ఈమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.

ఇక టాలీవుడ్ కి దూరంగా ఉంటూ ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా బిజీ గా మారింది.టబు ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం సమయాన్ని గడుపుతుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇక గతంలో నాగార్జునకు, టబు కు మధ్య ప్రేమ నడుస్తుందని తెగ పుకార్లు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే.వీళ్లు కలిసి నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో వీరి మధ్య పరిచయం పెరిగిందని అదే ప్రేమ అని తెలిసింది.అందుకే నాగార్జున పై ఉన్న ప్రేమ కోసమే ఇప్పటి వరకు టబు పెళ్లి చేసుకోలేదని ఇప్పటికీ అంటూనే ఉంటారు.

Advertisement

నాగార్జున మాత్రం తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని.కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చాలాసార్లు చెప్పుకొచ్చాడు.

ఇక ఇదంతా పక్కన పెడితే ఈమె రెమ్యూనరేషన్ మాత్రం విపరీతంగా ఉంటుందని టాక్.టాలీవుడ్ లో ఈమెకిచ్చే అంత రెమ్యూనరేషన్ లేకపోవటంతో ఈ అమ్మడు బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది.అక్కడ ఆమె భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

పైగా ఆమె కోసం అక్కడ మేకర్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని.ఆమె కూడా తను అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తున్న వారికే డేట్స్ ఇస్తుంది అని తెలిసింది.ఇక అటువంటి సదుపాయం టాలీవుడ్ లో లేదు కాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది అని తెలిసింది.

కానీ ఈ అమ్మడి కోసం టాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు