మన భారతదేశంలోని టాప్9 రొమాంటిక్ డెస్టినేషన్స్ ఏమిటో తెలుసా?

వివాహం అనేది మనిషి జీవితంలోనే ఓ అపురూప ఘట్టం.హిందూ సంప్రదాయం ప్రకారం అయితే ఓ మనిషి తన జీవితంలో ఒక్కసారి మాత్రమే వివాహం చేసుకుంటాడు.

అదే ఆచారం అనాదిగా వస్తోంది.కాబట్టి అలాంటి వివాహాన్ని ఇక్కడ భారతీయులు ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు.

ఇక ఆ తరువాతి జరగాల్సిన తంతుగురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.హనీమూన్ కోసం మనవాళ్ళు బాగా ఖర్చుచేసి మరీ కొన్ని కొన్ని రొమాంటిక్ డెస్టినేషన్స్ కి వెళ్తూ వుంటారు.

ఎందుకంటే ఆ ప్రదేశాలు ఆ జంటను ఎంత దగ్గర చేస్తాయంటే అది మాటల్లో వర్ణించలేని భావన.ముఖ్యంగా మన భారతదేశంలో టాప్ 9 బడ్జెట్ రొమాంటిక్ హనీమూన్ డెస్టినేషన్స్ వున్నాయి.

Advertisement

ఇపుడు వాటిగురించి తెలుసుకుందాం.ముందుగా సిక్కిం గురించి మాట్లాడుకుందాం.

సిక్కిం అందమైన రొమాంటిక్ ప్లేస్ లో ఒకటి.ఎన్నో అద్భుతమైన కట్టడాలకు ఇది నెలవు.

ఇక్కడ బౌద్ధ మత సాధువులు ఎక్కువగా నివసిస్తారు.ఈ మొనాస్టరీలలోని చుట్టూ పరుచుకున్న ప్రకృతి అందాలు, దూరంలో ఎత్తైన మంచు శిఖరాలు కొత్తజంటలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

దానితరువాత అండమాన్ ఐలాండ్స్ని చెప్పుకోవచ్చు.ఇక్కడ హనీమూన్ ప్లాన్ చేసుకున్నట్లైతే కేవలం 30 వేల బడ్జెట్లో ఐదు నుండి ఆరు రోజులు చాలా సంతోషంగా గడపవచ్చు.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన

ఆ తరువాత ఉదయపూర్ ప్రాంతం వివాహితులు చూడముచ్చటైన ప్రదేశం.ఇక్కడ ప్రకృతి అందాలు మనసులని రంజింపజేస్తాయి.ఇక మీ హనీమూన్ పీస్ ఫుల్ గా సాగాలంటే సౌత్ లోని గోవా బెస్ట్ ప్లేస్.

Advertisement

గోవా బీచ్ ఎంత ప్రసిద్ధిచెందిందో చెప్పాల్సినపనిలేదు.ఆ తరువాత లడక్ లోని ముఖ్య నగరం అయినటువంటి లేహ్ బ్యూటిఫుల్ ప్లేస్.

అయితే ఇక్కడికి హనీమూన్ ట్రిప్ కి వెళ్లేముందు వెదర్ సిచువేషన్ ను చెక్ చేసుకోవాలి.వీటితరువాత లక్షద్వీప్ని చెప్పుకోవచ్చు.

ఇక్కడ సముద్ర జీవులను చూస్తూ ఎంజాయ్ చేయడం ఒక అద్భతమైన అనుభూతి.కాశ్మీర్ బావుంటుంది గానీ చెక్ చేసి వెళ్లడం మంచింది.

ఆ తరువాత కేరళ, పుడిచ్చేరి వరుసగా టాప్ రొమాంటిక్ డెస్టినేషన్స్ లిస్టులో ఉంటాయి.

తాజా వార్తలు