మహానటి సావిత్రికి అప్పట్లో అంత కోపం ఉండేదా?

అప్పట్లో హీరోలతో సమానంగా హీరోయిన్ లు స్టార్ స్టేటస్ ను దక్కించుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదు.

అలాంటి అరుదైన గుర్తింపు పొందిన అలనాటి కథానాయికలో మహానటి సావిత్రి ఒకటి.

అప్పట్లో ఈమె టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలలో చక్రం తిప్పిన నటిగా పేరొందారు.డబ్బు, హోదా, కీర్తి ప్రతిష్టలు అన్నిటినీ అందుకున్నారు.

ఈమె డేట్స్ కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సైతం వెయిట్ చేసేవారంటే అప్పట్లో ఈమె హవా ఎలా సాగించింది అన్నది అర్దం అవుతుంది.అందం అభినయం కలబోసిన ఈ నటి హృదయం కూడా చాలా మృదువైనది.

సాయం అని అడుగక ముందే వారి అవసరాన్ని గుర్తించి వీలైనంత సహాయం చేసే వారట సావిత్రి.ఎంతో సౌమ్యంగా ఉంటారని మర్యాదకు మారుపేరని అందరికీ ఎంతో గౌరవం ఇస్తారని , స్థాయితో సంబంధం లేకుండా అందరితోనూ కలివిడిగా ఉంటారని ఈమెకు ఇండస్ట్రీలో మంచి పేరుంది.

Advertisement

అయితే అలాంటి ఈమె ఒక హీరోయిన్ పై ఆగ్రహాన్ని చూపించారు అంటే నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమేనట, అయితే అంతగా కోపం వచ్చేంతగా ఏమి జరిగింది సావిత్రి ఫైర్ అయ్యారు అంటే అది చిన్న విషయం అయ్యుండదు కదా మరి అసలు ఏమి జరిగింది అంటే.రామవిజేత వారి సినిమా షూటింగ్ సమయంలో ఒకసారి సావిత్రి, దీప మధ్య ఒక సంభాషణ జరిగింది ఆ సమయంలో దీపపై తన ఆగ్రహాన్ని చూపుతూ మంచం రెడీగా ఉంది వెళ్లి పడుకో అన్నారు సావిత్రి.

వీరిద్దరూ కలిసి ఒక సన్నివేశం తీయాల్సి ఉండగా ఆ షూటింగ్ సమయానికి ముందే చేరుకున్నారు నటి సావిత్రి.అయితే దీప మాత్రం ఎంతకీ రాకపోవడంతో వెయిట్ చేసి చేసి విసుగు చెందిన నటి సావిత్రి బయటకు వచ్చి కూర్చున్నారు, ఇంతలో తీరిగ్గా కారు దిగి మెల్లగా నడుచుకుంటూ వస్తున్న దీపను చూసి సావిత్రి గారికి కోపం వచ్చింది.

ఏంటమ్మా దీప ఇంత ఆలస్యం చేసావు ? నేను ఒకప్పుడు నీలా చాలా బిజీ హీరోయిన్నే అయితే ఎపుడు ఇలా నాకోసం సెట్ లో ఎవరూ కూడా వెయిట్ చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించే దాన్ని, ఒక నాటికి సమయం అనేది అంతా ముఖ్యం, అది క్రమశిక్షణ కూడా అని అన్నారు.అందుకు దీప మీరు ఇంకా పాత కాలంలోనే ఆగిపోయారు, అప్పట్లో నెలకో సినిమా రావడం కూడా కష్టం.అలాంటిది ఇపుడు వారానికో సినిమా రిలీజ్ అవుతున్న రోజుల్లో ఇలాంటి నియమాలు ఏమిటి ? మీరు సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి సంజాయిషీ చెబుతున్నా, నాకు అందులోనూ చాలా తలనొప్పిగా ఉంది అంటూ కాస్త ఎబ్బెట్టుగా సమాధానం ఇచ్చిందట.దానికి సావిత్రి అవునా ఇంట్లో రెస్ట్ తీసుకోవడం ఎందుకులే ఎలాగో ఇపుడు నేడు జబ్బు పడిన సీనే కదా సెట్ లో మంచం రెడీగా ఉంది పోయి పడుకొని రెస్ట్ తీసుకో అని కాస్త కటువుగా అన్నారట.

ఇక్కడ విషయం దీప తనని ఎదో అన్నది అని కాదట సమయం విలువ తెలుసుకోకుండా ఒక క్రమశిక్షణ అనేది లేకుండా ప్రవర్తించినందుకు సావిత్రి గారికి కోపం వచ్చి ఎన్నడూ లేని విధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట సావిత్రి.

వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?
Advertisement

తాజా వార్తలు