Tollywood Directors: సినిమా ఇండస్ట్రీ లో ఇంత దారుణమైన దర్శకులు ఉన్నారా ?

ఇప్పుడున్న పరిస్థితులలో సినిమా ఇండస్ట్రీ అంటేనే కాపీ కొట్టి అభిమానులను అలరిస్తున్నారు అని చాలామంది నిక్కచ్చిగా చెబుతున్నారు.

ఎందుకంటే ఇండస్ట్రీలో కొత్త కథలు లేవు ఎవరైనా ఏదైనా కొత్తగా రాసి ఫలానా డైరెక్టర్ ( Director ) దగ్గరికి తీసుకెళ్తే చాలు అది వారికి తెలియకుండానే చిత్రీకరణ జరిగిపోయి విడుదల అయిపోతుంది.

అయితే ఇదేమీ కొత్త విషయం కాదు గతంలో కూడా చాలామంది ఇలాంటి పనులు చేసి సినిమాలలో విడుదల చేసి ఘనవిజయాలు సాధించారు.అందుకు దాసరి నారాయణరావు( Dasari Narayana ) కూడా ఏమాత్రం తక్కువ కాదు.

అతను తీసిన ఒసేయ్ రాములమ్మ సినిమా కథ తన శిష్యుడి దగ్గర నుంచి దొంగిలించిందే.అతడు మరెవరో కాదు దర్శకుడు దవళ సత్యం.

దాన్ని ఆయన ఒప్పుకున్నాడు అనే విషయం కూడా మనం మర్చిపోవద్దు.కానీ అలా ఒప్పుకోకుండా సినిమాలను తీసేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు.నిజానికి తెలుగులో తీసిన ఠాగూర్ సినిమా కథ( Tagore Movie ) రమణ అనే పేరుతో తమిళ్లో వచ్చింది.

Advertisement

మొదట మురుగదాస్ ఈ సినిమాని తమిళ్ లో తీశాడు.కానీ ఈ కథను అప్పటి బడ్డింగ్ డైరెక్టర్ గా ఉన్న నందకుమార్ అనే వ్యక్తి నుంచి తస్కరించింది.

మురగదాస్ కి( Murugadoss ) ఇలా కథలను కొట్టేయడం పెద్ద పనేమీ కాదు.సర్కార్ అనే సినిమా కథ కూడా రచయిత ప్రదీప్ దగ్గర నుంచి కొట్టేయగా అతడు కంప్లైంట్ ఇచ్చాడు.

దాంతో దర్శకుడు భాగ్యరాజు మురుగదాసును తీవ్రంగా హెచ్చరించాడు కూడా.ఇక మన తెలుగు సినిమాలో చిరంజీవి కం బ్యాక్ సినిమా అయినటువంటి ఖైదీ నెంబర్ 150( Khaidi No.150 ) చిత్రం ముందు తమిళ్లో కత్తి పేరుతో వచ్చింది.దీనిని ఆ చిత్ర దర్శకుడు మరో దర్శకుడైన గోపి నైనార్ నుంచి కొంచెం కూడా మనస్సాక్షి అనేది లేకుండా అన్యాయంగా తీసుకొని సినిమా చేశాడు అనే విషయం ఎవరికీ తెలియదు.

ఇక కే జి ఎఫ్ కూడా ప్రశాంత్ నీల్( Prasanth Neel ) సొంత కథ కాదు అంటారు కొంతమంది.ఒక విలేకరి తన దగ్గరికి వచ్చి చెప్పిన కథను అతని కొట్టేశాడు అంటారు.కథలో చిన్న మార్పులు చేసి సినిమాగా తీసేశారు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

ఈ  సినిమాలో బంగారం స్మగ్లింగ్ కాగా విలేకరి చెప్పిన కథలో చందనం స్మగ్లింగ్ మీద కథ నడుస్తుంది.ఈ ఒక్క చిన్న మార్పు తప్ప ఆ సినిమా పూర్తిగా ఆ విలేకరి చెప్పినట్టుగానే ఉంది అనేది అందరూ చెప్పుకునే మాట.ఇక తెలుగులో యుద్దనపూడి సులోచన రాణి ( Yaddanapudi Sulochana Rani ) కథలను సైతం ఉన్నది ఉన్నట్టుగా తీసి కాపీ కొట్టి ఆవిడ పేరు కూడా క్రెడిట్ ఇవ్వకుండా టైటిల్స్ వేసుకునే ప్రబుద్ధులు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కథ నచ్చితే నిర్మాత లేదా హీరోకి మాత్రమే చెప్పాలి దర్శకులకు చెప్పారో ఇక అంతే సంగతులు మీ సినిమా మీరే థియేటర్లో చూసుకోవాలి మరొకరి దర్శకత్వంలో.

Advertisement

తాజా వార్తలు