అందుకే ఫస్ట్ హాఫ్ స్లోగా తీసాం.. ట్రోల్స్ పై నాగ్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) నటించిన కల్కి సినిమా( Kalki Movie ) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

అయితే ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

చూడటానికి బోరింగ్ అనిపిస్తోందంటూ ఎంతోమంది ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.అయితే కల్కి సినిమా ఫస్ట్ హాఫ్ పట్ల వస్తున్నటువంటి ట్రోల్స్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) స్పందించి క్లారిటీ ఇచ్చారు.

కల్కి సినిమా మొదటి భాగం కావాలనే  స్లోగా చూపించామని తెలిపారు.ఈ సినిమాలో మనం మూడు ప్రపంచాలను చూపించబోతున్నాము ఈ మూడు ప్రపంచాలు ప్రేక్షకులకు అర్థం కావాలన్న ఉద్దేశంతోనే ఇలా స్లోగా చూపించాల్సి వచ్చిందని అశ్విన్ వెల్లడించారు.ఫ్యూచర్‌లో చూపించబోయే ప్రపంచానికి ఇప్పుడు మన ఆడియన్స్‌ కనెక్ట్ అవుతారో లేదోననే భయం అయితే ఖచ్చితంగా మాకు కలిగింది.

పైగా మూవీలో మనకి నలుగురు పెద్ద స్టార్స్ ఉన్నారు.

Advertisement

కనుక కథ పరంగా, వారి మార్కెట్ పరంగా ఆ నలుగురు స్టార్లను బ్యాలెన్స్ చేసుకోగలగాలి అందుకే ఇలా ఫస్ట్ హాఫ్ కావాలనే స్లోగా చూపించామని అసలు కల్కి కథ తర్వాత భాగాలలో అద్భుతంగా ఉండబోతుందంటూ ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా చూపించాము కనుక ప్రేక్షకులు ఎక్కడా కూడా గందరగోళానికి గురి కాకుండా సినిమా చూశారని ఈయన తెలిపారు.ఇక ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీలు ఆయన కమల్ హాసన్ అమితాబ్ వంటి వారందరూ కూడా కీలక పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు