విజయవాడ దుర్మమ్మ ఆలయ ఈవో, ఛైర్మన్ మధ్య మరోసారి విభేదాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం ఈవో, ఛైర్మన్ ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

ఈ క్రమంలో ఈవో భ్రమరాంబ తీరుపై ఆలయ ఛైర్మన్ కర్నాటి రాంబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అమ్మవారి శాకాంబరీ ఉత్సవాల సమయంలో ఈ వివాదం బహిర్గతం అయింది.ఆలయ అంతర్గత బదిలీల్లో భాగంగా ఛైర్మన్ పేషీలో మార్పులు చేశారు ఈవో భ్రమరాంబ.

ఈ నేపథ్యంలో ఒక్క అటెండర్ నే కేటాయించడంపై ఛైర్మన్ తోపాటు పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ ఒక్క అటెండర్ ను పేషీ నుంచి వెనక్కి పంపించి వేశారు.

ఛైర్మన్ పేషీలో దేవస్థానం సిబ్బంది కనిపించలేదు.శాకాంబరీ ఉత్సవాల నేపథ్యంలో దేవస్థానం సిబ్బంది లేకపోవడంపై ఛైర్మన్ మండిపడ్డారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Latest Suryapet News