ఆ కారణం చేత ముద్దు సీన్లలో నటించలేదు... ప్రియమణి కామెంట్స్ వైరల్!

వెండితెర నటిగా ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందట సరసన నటించి హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రియమణి( Priyamani ) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసిన ఈమె ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

 That's Why She Didn't Act In Kissing Scenes,priyamani,kiss Scenes,naga Chaitanya-TeluguStop.com

తాజాగా ప్రియమణి నాగచైతన్య( Naga Chaitanya) నటించిన కస్టడీ సినిమా( Custody Movie )లో సీఎం పాత్రలో కనిపించిన విషయం మనకు తెలిసిందే.త్వరలోనే నయనతార షారుఖ్ ఖాన్ జంటగా నటించిన జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Telugu Naga Chaitanya, Priyamani, Priymani-Movie

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రియమణి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేశారు.అయితే ఈ మధ్యకాలంలో ప్రియమణి ఎక్కువగా బోల్డ్ సన్నివేశాలలో అలాగే ముద్దు సీన్స్( Kiss Scenes ) వంటి వాటిలో నటించడానికి ఏమాత్రం ఇష్టం చూపలేదు.అయితే ఈమె ఇలాంటి సన్నివేశాలకు దూరంగా ఉండడానికి గల కారణాలను ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే ఇలాంటి కిస్ సీన్స్ కి ఈమె దూరంగా ఉండడానికి కారణం ఏంటి అనే విషయం గురించి మాట్లాడుతూ…

Telugu Naga Chaitanya, Priyamani, Priymani-Movie

పెళ్లి తర్వాత ఇలాంటి సీన్లలో నటించకూడదని తాను నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.సినిమాలలో కేవలం ఆ పాత్రలలో నటించిన కానీ వెండితెరపై ఆయా సీన్స్ చూసినప్పుడు తనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఈమె తెలిపారు.అంతేకాకుండా నేను అలాంటి సీన్స్ చేసిన ప్రతిసారి తన భర్తకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని ఇది మా ఇద్దరి మధ్య ఒక మంచి వాతావరణం సృష్టించలేదని అందుకే తాను ఇలాంటి సన్నివేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఈ సందర్భంగా ప్రియమణి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube