అక్షతలకు, తలంబ్రాలకు తేడా ఏమిటి? ఏవి ఎప్పుడు వాడాలి?

పసుపుతో కలిపిన బియ్యాన్ని అక్షతలు అంటారు.పెళ్లిళ్లు, శుభకార్యాలు, చిన్న పిల్లల పుట్టిన రోజులు, పూజలు, పునస్కారాలప్పుడు వీటిని కలుపుతుంటారు.

ఒక పెళ్లిలో తప్ప వీటిని ఎప్పుడు వాడినా అక్షతలనే అంటారు.కానీ పెళ్లిళ్లో వాడితే మాత్రం తలంబ్రాలుగా పిలుస్తారు.

వివాహ మహోత్సవ కార్యక్రమంలో వధూవరులు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు పోసుకునేవే తలంబ్రాలు.అదే పెళ్లిలో పెద్దలు ఆశీర్వదించి వేసేవి అక్షతలు.

అసలు తలంబ్రాలు అంటే ఏమిటి

ప్రాలు అంటే బియ్యం.తల మీద పోయడాన తలంబ్రాలు అయ్యాయి.

Advertisement
DIFFERENCE BETWEEN AKSHATHALU AND THALAMBRALU, Akstalu , Tala Mbralu , Devotiona

తల పైనున్న బ్రహ్మరంధ్రం మీద అక్షతలు పోసుకోవడం శుభ ప్రదంగా భావిస్తారు.ముందుగా పురోహితుడు ఎండు కొబ్బరి చిప్పలో ఈ అక్షతలను పోసి వాటికి  పూజ చేస్తాడు.

కపిల గోవులను స్మరించి, పుణ్యకర్మలు చేస్తూ.దాన ధర్మాలతో జీవనం సాగించాలని, శాంతి, పుష్టి, తుష్టి, వృద్ధి చెందాలని.

చేపట్టిన పనులకు ఆటంకాలు కలగ కూడదని, ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలగాలని.

Difference Between Akshathalu And Thalambralu, Akstalu , Tala Mbralu , Devotiona

చంద్ర నక్షత్రాల సాక్షిగా దాంపత్యం సవ్యంగా సాగుతూ.సుఖ శాంతులతో మెలగాలని మంత్ర పఠనం చేసి వధూవరులను ఒకరి తలమీద ఒకరిని పోసుకొమ్మని సూచిస్తాడు.వీటినే తలంబ్రాలు అంటారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

కానీ కొన్ని ప్రాంతాల్లో బియ్యానికి బదులుగా జొన్నలతో కూడా తలంబ్రాలను తయారు చేస్తారు.ఈ సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.

Advertisement

నూరేళ్లు పిల్లాపాపలతో హాయిగా జీవించండంటూ.పెద్దలు పిల్లలు, నూతన వధూవరుల తలపై వేసే పుసుపు బియ్యాన్ని అక్షతలు అంటారు.

తాజా వార్తలు