నిరాడంబరంగా బెంగాల్ ​ ముఖ్యమంత్రిగా దీదీ ప్రమాణస్వీకారం..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా తాజాగా మూడోసారి మమతాబెనర్జీ ప్రమాణం స్వీకారం చేశారు.

ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితుల తీవ్రత నేపథ్యంలో భాగంగా నేడు ఉదయం 10 గంటల 45 నిమిషాల సమయంలో రాష్ట్ర రాజ్ భవన్ లో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌ కడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.గవర్నర్ మమతా బెనర్జీ తో ప్రమాణ స్వీకారం చేయించారు.

వరుసగా మూడోసారి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మమతా బెనర్జీకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రమాణస్వీకారం చేస్తున్న మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ ఆవిడకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి అది కొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి.ఇందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ బట్ట చార్జి తో సహా.మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అలాగే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షులుగా కొనసాగుతున్న సౌరవ్ గంగూలి ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ లాంటి కొద్దిమంది వీవీఐపీలకు మాత్రమే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.ఇకపోతే పశ్చిమ బెంగాల్లో జరిగిన 294 అసెంబ్లీ స్థానాల్లో మమతా బెనర్జీ నాయకత్వం వహించిన తృణముల్ కాంగ్రెస్ ఏకంగా 213 స్థానాలలో విజయం సాధించి అఖండ విజయాన్ని అందుకుంది.

Advertisement

ఇకపోతే రాష్ట్రంలో మిగతా సీట్లలో భారతీయ జనతా పార్టీ 77 సీట్లు గెలుపొందగా.ఇతరులు కేవలం రెండు సీట్లకే పరిమితం అయ్యారు.అయితే మమతా బెనర్జీ తాను ప్రాతినిధ్యం వహించిన స్థానంలో మాత్రం 1700 ఓట్లతో ఓటమిని చవిచూశారు.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు