Sharwanand : శర్వానంద్ భార్య అన్ని రూ.కోట్ల కట్నం ఇచ్చిందా.. ఆమె రేంజ్ ఇదేనంటూ?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్( Sharwanand ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగులో శర్వానంద్ మహానుభావుడు, శతమానం భవతి, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రాధా, మహాసముద్రం, శ్రీకారం, జాను, పడి పడి లేచే మనసు, ఒకే ఒక జీవితం ఇలా ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకున్న వారిలో శర్వానంద్ కూడా ఒకరు.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో శర్వానంద్ ఒక ఇంటివాడయ్యాడు.

రక్షితా రెడ్డి( Rakshitha Reddy ) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.తాజాగా వీరి పెళ్లి జైపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.దాదాపు రెండు రోజులపాటు అట్టహాసంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలకు తెలుగు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు( Film celebrities , politicians ) సైతం హాజరయ్యారు.

ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టడంతో అభిమానులు ప్రేక్షకులు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంటకు సంబంధించిన ఒక వార్త చెక్కలు కొడుతోంది.

Advertisement

అదేంటంటే హీరో శర్వానంద్ కు అత్తింటి వారి నుంచి అందిన కట్న కానుకల గురించి అనేక రకాల వార్తల వినిపిస్తున్నాయి.శర్వానంద్ కు ర‌క్షితారెడ్డికి రు.100 కోట్ల స్థిర‌చ‌రాస్తులు క‌ట్నంగా వ‌చ్చాయ‌ని తెలుస్తోంది.హైద‌రాబాద్‌లో ఉన్న ప్లాట్లు, ఇండిపెండెంట్ హౌస్‌తో పాటు కొంత న‌గ‌దు కూడా క‌ట్నంగా ఇచ్చార‌ట‌.

అయితే మేజ‌ర్ క‌ట్నం మాత్రం స్థిరాస్తుల రూపంలోనే వ‌చ్చిన‌ట్టు చెపుతున్నారు.అయితే శ‌ర్వాలాంటి స్టార్ హీరో రేంజ్‌కు రు.100 కోట్ల క‌ట్నం అంటే కాస్త త‌క్కువే అన్న చ‌ర్చ కూడా ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది.ఇక రక్షితారెడ్డికి కూడా బ‌ల‌మైన బ్యాక్‌గ్రౌండ్ ఉందడోయ్.

ఆమె తాత మాజీ మంత్రి టిడిపి నాయకుడు, దివంగ‌త‌ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.ఆయ‌న చిత్తూరు జిల్లాలోని శ్రీకాళ‌హ‌స్తి నుంచి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచి గ‌త చంద్ర‌బాబు కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు.

ఇక ఆమె నాన్న హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి.ఇక ర‌క్షితా రెడ్డి పేరు మీద కూడా మంచిగానే ఆస్తులు ఉన్నాయంటున్నారు.

జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు