నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ప్రస్తుతం అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా ను ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
ఈ నెల 10వ తారీఖున బాలకృష్ణ పుట్టిన రోజు( Balakrishna’s birthday ) సందర్భంగా అనిల్ రావిపూడి సినిమా యొక్క టైటిల్ రివీల్ చేయడం తో పాటు విడుదల తేదీ విషయం లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఒక వైపు అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరో వైపు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమా కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తారీఖున ఆ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు స్వయంగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత అయిన నాగ వంశీ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.ఇక ఆ సినిమా కు దర్శకుడు ఎవరు అనే విషయం లో కూడా క్లారిటీ వచ్చేసింది.
వాల్తేరు వీరయ్య సినిమా తో దర్శకుడి గా సూపర్ హిట్ దక్కించుకున్న బాబీ ( boby )ని బాలయ్య సినిమా కు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.బాబీ విభిన్నమైన సినిమా లను రూపొందించడం లో సిద్ధహస్తుడు.అందుకే బాలకృష్ణ ఆయన కు అవకాశం ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక పొలిటికల్ డ్రామా నేపథ్యం లో రూపొందబోతుందట.
బాలకృష్ణ వచ్చే సంవత్సరం జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందిన బాలకృష్ణ ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే గా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆశ పడుతున్నాడు.అందుకోసం తన సినిమా ను ఉపయోగించుకోవాలని ఉద్దేశం తో బాబీ దర్శకత్వం లో ఒక పొలిటికల్ డ్రామా నేపథ్యం లో సినిమా చేయబోతున్నాడు.ఆ సినిమా సక్సెస్ అయ్యి పొలిటికల్ గా బాలకృష్ణ కు మైలేజ్ తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.