డివోర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ ఐశ్వర్య రజినీకాంత్ పై ధనుష్ పోస్ట్.. ఆమె రిప్లై ఏంటంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇటీవల విడిపోయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ దంపతులు వారి 18ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు అన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ జంట కారణాన్ని వెల్లడించలేదు కానీ విడిపోయినా కూడా వారిద్దరూ స్నేహితులుగా ఉంటాము తెలిపారు.

ఈ జంట విడిపోయిన తర్వాత ఎక్కడ ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోవటం జరగలేదు.

కానీ తాజాగా విడాకుల తర్వాత ఈ జంట మొదటిగా సారిగా స్పందించారు.ఐశ్వర్య గురించి హీరో ధనుష్ తొలిసారిగా స్పందించాడు.తాజాగా ఐశ్వర్య పయని అనే ఒక మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసింది.

Advertisement

తొమ్మిదేళ్ల తర్వాత ఐశ్వర్య మెగాఫోన్ చేతపట్టారు.మ్యూజిక్ వీడియో తమిళ వెర్షన్ ను సూపర్ స్టార్ రజినీకాంత్ విడుదల చేశారు.

ఇక తెలుగు వెర్షన్ ను అల్లు అర్జున్, అదేవిధంగా మలయాళ వెర్షన్ ను మోహన్ లాల్ విడుదల చేశారు.ఇక ఈ వీడియో గురించి తాజాగా ధనుష్ పోస్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

పయని మ్యూజిక్ వీడియో ని డైరెక్ట్ చేసిన నా స్నేహితురాలు ఐశ్వర్య కు అభినందనలు గాడ్ బ్లెస్ యు అని పోస్ట్ చేయగా.ఆ పోస్టు పై స్పందించిన ఐశ్వర్య రజనీకాంత్ మాజీ భర్త కు థాంక్స్ చెప్పింది.ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్టులు చూసిన ధనుష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే వీరిద్దరు విడిపోయారు అన్న వార్తను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఇప్పటికీ వీరు ఇద్దరూ కలిసి పోవాలి అని అభిమానులు తాపత్రయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు