'డెలివరీ మచ్చో' సర్వీస్... బాడీ బిల్డర్స్ చేత ఫుడ్ డెలివరీ!

కోవిడ్-19 ప్రపంచ దేశాలకు ఎన్నో పాఠాలను నేర్పించింది.ఈ మహమ్మారి వల్ల దేశాల ఆర్ధిక వ్యవస్థలు చిన్నా భిన్నమైన విషయం విదితమే.

హోటల్స్,రెస్టారెంట్ ల పరిస్థితి అయితే ఇప్పటికి కూడా కోలుకోవడం కష్టంగానే ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో జపాన్ లోని ఒక రెస్టారెంట్ యజమాని వినూత్నంగా ఆలోచించి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని అనుకున్నాడు.

అందుకే తన ఫుడ్ ను డెలివరీ చేయడం కోసం బాడీ బిల్డర్స్ ను అపాయింట్ చేసుకున్నాడు.బాడీ బిల్డర్స్ ఏంటి ఫుడ్ డెలివరీ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా.

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని హోటళ్లలానే జపాన్‌లోని సుషీ రెస్టారెంట్ కూడా మూతపడింది.దీనితో యజమాని నష్టాల్లో కూరుకుపోయాడు.

Advertisement

అయితే, ఎలాగైనా తన వ్యాపారాన్ని తిరిగి అభివృద్ధి చేసుకోవాలని భావించిన ఆ రెస్టారెంట్ యజమానికి వినూత్నంగా ఒక ఆలోచన వచ్చింది.అసలుకే బాడీబిల్డర్‌ అయిన ఆ యజమాని ఫుడ్‌ డెలవరీకి కూడా బాడీ బిల్డర్ లను పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి మరికొంతమంది బాడీ బిల్డర్లను పనిలో పెట్టుకున్నాడు.

ఫుడ్‌ ఆర్డర్‌రాగానే ఈ బాడీబిల్డర్లు సూట్‌ ధరించి ఆహారం తీసుకెళ్తారు.ఫుడ్ డెలివరి ఇచ్చిన తరువాత సూట్ విప్పి అక్కడే తమ దేహదారుఢ్య ప్రదర్శన చేస్తారట.

దీనిని డెలివరీ మచ్చో సర్వీస్ అని పిలుస్తారట.అయితే ఈ అవకాశం ప్రతి ఒక్కరికీ ఉండదట.కేవలం ఎవరైతే 7,000 యెన్ ల గరిష్ట ఆర్డర్ ఇస్తారో వారికేనట.7 వేల యెన్ లు అంటే భారత కరెన్సీ లో రూ .4825 లు అన్నమాట.అంతగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన వారికే ఈ ప్రదర్శన సౌకర్యం కల్పిస్తున్నారు.

అయితే ఈ పద్దతి ఎదో కొత్తగా ఉండడంతో రోజుకు పది మంది వినియోగదారులు ఫుడ్‌ ఆర్డర్‌ ఇస్తున్నారట.ఇలా చూసుకుంటే ఆ రెస్టారెంట్ యజమాని నెలకు సుమారు 1.5 మిలియన్ యెన్స్‌ అంటే రూ.పదిలక్షలకుపైగానే సంపాదిస్తున్నాడన్నమాట.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు