కరోనా ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. మృతి చెందిన కరోనా పేషెంట్లు.. ?

గత సంవత్సరంతో ఈ కొత్త సంవత్సరం పోటాపోటీగా సాగుతుంది.

నువ్వు ఎంత మంది ప్రాణాలను తీసావో, ఆ లెక్కను దాటి నేను ముందుంటానని పోటీలో ఉన్నట్లుగా కనిపిస్తుంది.

లేకుంటే పోయిన ఏడాదినే మరచిపోలేని జీవితాల్లో ఈ ఏడాది కూడా చీకట్లను గట్టిగా అలుముతుంది.ఒక వైపు కరోనా, మరో వైపు రోడ్డు, అగ్ని ప్రమాదాలు.

ఇవి చాలవా చావడానికి.ఇకపోతే ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో పెను విషాదం చోటు చేసుకుంది.

స్దానికంగా ఉన్న రాజధాని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి ఐదుగురు కరోనా పేషెంట్లు మరణించారు.కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 34 మంది పేషెంట్లున్నారని, తొమ్మిది మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

Advertisement

ఈ క్రమంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఐదుగురు కరోనా పేషెంట్లు అగ్ని కీలలకు ఆహుతి అయ్యారని వెల్లడించారు.ఇక ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.4 లక్షల పరిహారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ సింగ్ బాఘల్ ప్రకటించారు.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు