టీడీపీ ఎవరి ఇష్టం వారిదే ! బాబు బాధ అదే ? 

తెలుగుదేశం పార్టీ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది క్రమశిక్షణ.అసలు సిసలైన క్రమ శిక్షణకు మారు పేరుగా ఆ పార్టీ నాయకులు మెలుగుతూ వచ్చారు.

కానీ గత కొంతకాలంగా ఆ పార్టీలో ఆ క్రమశిక్షణ ఎక్కడా కనిపించడం లేదు.ఎవరికి వారే తామే గొప్ప నాయకులం అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్న పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయింది.

ముఖ్యంగా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందినప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది.పార్టీ సీనియర్ నాయకులతో పాటు, యువ నాయకులు సైతం ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప, పార్టీ నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్న తపన మెజారిటీ నాయకుల్లో కనిపించకపోవడం టిడిపి కి శాపంగా మారిందట.

పార్టీ పని అయిపోయిందని అభిప్రాయం ఇప్పుడు ప్రతి నాయకులలోను స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

ఇటీవల తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది.వాస్తవంగా అయితే నాయకులు ఆ బాధ్యతలు తీసుకుని, అక్కడ పార్టీ విజయం కోసం కష్ట పడాల్సి ఉన్న , వారు ఎవరు పెద్దగా స్పందించే విధంగా కనిపించకపోవడంతో,  బాబు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ఇలా చేయడం వల్ల పార్టీ నాయకుల్లో ఉత్సాహం వచ్చి యాక్టివ్ అవుతారు  అని, బాబు తన స్థాయిని సైతం తగ్గించుకోవాల్సి వచ్చింది.ఇటీవల అచ్చెన్న నాయుడు సైతం పార్టీ పరిస్థితి అయిపోయిందని, లోకేష్ సరిగా ఉంటే , పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వస్తుంది అంటూ మాట్లాడిన మాటలు వీడియో రూపంలో బయటకు రావడం వంటి కారణాలతో టిడిపి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనే విషయం బహిర్గతం అయిపోయింది.

అచ్చెన్న వ్యవహారం బయటకి వచ్చిన దగ్గర నుంచి బాబు అందరిపైనా అనుమానాలు పెంచుకోవడం, ఎవరినీ  నమ్మకపోవడం ఇలా ఎన్నో రకాలుగా టీడీపీ ఇబ్బందులు పడుతోంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు