హైబీపీ ఉన్న‌వారు పెరుగు తింటే ఏం అవుతుందో తెలుసా?

హైబీపీ లేదా అధిక ర‌క్త‌పోటు.చాలా మంది ఎదుర్కొనే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి.

మారుతున్న జీవిన శైలి, ఒత్త‌డి మ‌రియు ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు.ర‌క్త‌పోటు అధికంగా ఉండ‌డం వ‌ల్ల గుండె పోటు, గుండె జబ్బులు, కిడ్నీ జ‌బ్బులు ఎదుర‌వుతాయి.

అందుకే అధిక ర‌క్త‌పోటును కంట్రోల్ చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం.అయితే అధిక ర‌క్త‌పోటు ఉన్న వారికి పెరుగు మంచి ఔష‌ధంలా ప‌ని చేస్తుంది.

అధిక ర‌క్త‌పోటు ఉన్న వారు ప్ర‌తి రోజు క‌నీసం రెండు క‌ప్పుల‌ పెరుగును తీసుకోవాలి.పెరుగు తీసుకోలేని వారు మ‌జ్జిగ అయినా తీసుకోవ‌చ్చు.

Advertisement

ఇలా చేయ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులోకి వ‌స్తుంది.నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం కూడా చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

అలాగే పెరుగు తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న‌, నీర‌సం త‌గ్గించి.శ‌రీరాన్ని రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.

ఇక పెరుగు వ‌ల్ల మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.వాటిపై కూడా ఓ లుక్కేసేయండి.

ప్ర‌తి రోజు పెరుగు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి.మంచి కొలెస్ట్రాల్ పెరుగుతంది.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

త‌ద్వారా గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.అలాగే రోజుకు ఒకటి లేదా రెండు క‌ప్పుల పెరుగు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ‌ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

Advertisement

ఇక ఈ సీజ‌న్‌లో చాలా మంది జ‌లుబు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు.అలాంటి వారు పెరుగులో మిరియాల పొడి క‌లిపి తీసుకుంటే.

సులువుగా జ‌లుబుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.పెరుగులో ఉన్న క్యాల్షియం.

ఎముకలకు, దంతాలకు బ‌లంగా మారుస్తుంది.పెరుగు చ‌ర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ప్ర‌తి రోజు క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగు తీసుకుంటే.చ‌ర్మం య‌వ్వ‌నంగా, అందంగా ఉంటుంది.

మ‌రియు పెరుగు వృధ్దాప్య ఛాయల‌ను క‌నిపించ‌కుండా చేస్తుంది.

తాజా వార్తలు