ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసిన జవాన్.. అసలు విషయమేంటంటే..

ఆ పిల్లల పట్ల కన్నతండ్రే కాల యముడు అయ్యాడు.

పిల్లలను కంటికి రెప్పలా కాపాడు కోవాల్సిన తండ్రి ఆ పిల్లలను దారుణంగా చంపేసిన ఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది.

భార్య భర్తల మధ్య గొడవలకు అభం శుభం ఎరుగని పసి పిల్లలను బలి చేసుకున్నాడు ఆ కిరాతక తండ్రి.అసలు వారు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని ఆ పసి పిల్లల మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి.

తమ మధ్య గొడవలకు ఆ పసి పిల్లలను తండ్రి బలి చేసుకున్నాడు.హాయిగా ఆడుకుంటున్న పిల్లలను జల సమాధి చేసేసాడు.

ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది.ఎందుకు అతడు ఇలా తన కన్న పిలల్లనే చంపుకున్నాడు.

Advertisement
CRPF Jawan Who Pushed Two Children Into A Well Details, Crime News, Family Dispu

అనే విషయాలు తెలియాలంటే అసలు మ్యాటర్ మొత్తం తెలుసు కోవాల్సిందే.ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసు కుందాం.

మహబూబాబాద్ గడ్డి గూడెం కి చెందిన రామ్ కుమార్ అనే CRPF జవాన్ తన ఇద్దరు పిల్లలను కడతేర్చాడు.వారి ఇద్దరు పసి పిల్లలను వ్యవసాయ బావిలోకి పడేసి వారిని జల సమాధి చేసేసాడు.

ఇంత దారుణమైన ఘటన జరగడంతో ఆ ఊరిలో విషాదం నెలకొంది.సెలవలు కారణంగా ఇంటి దగ్గర ఆడుకుంటున్న తన ఇద్దరు పిల్లలను నమ్మించి బావి దగ్గరికి తీసుకు వెళ్ళాడు.

Crpf Jawan Who Pushed Two Children Into A Well Details, Crime News, Family Dispu

అమ్మి జాక్సన్, జానీ బెస్టో అనే తన ఇద్దరు పిల్లలను బావి దగ్గరకు తీసుకు వెళ్లి బావిలోకి నెట్టేశాడు.ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకొని ఆ పిల్లలను బయటకు తీసేలోపే వారు మరణించారు.ఆ పిల్లలను బావిలోకి తోసేసిన తర్వాత అతడు అక్కడి నుండి పారిపోయాడు.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
తగ్గేదెలా.. వెస్టిండీస్ బౌలర్ పై కాలు దువ్విన యువరాజ్ సింగ్

ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను తల్లడిల్లి పోయేలా చేస్తుంది.అతడు ప్రస్తుతం ముంబై CRPF జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement

భార్య శిరీష తో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పిల్లలను చంపేసి పరారీలో ఉన్నాడు.పిల్లలు ఇద్దరు మరణించడంతో ఆ కన్నతల్లి గుండె పగిలేలా రోధిస్తుంది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

తాజా వార్తలు