నిన్న విజయవాడలో ఏపీ బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కమ్యూనిస్టులను ఉద్దేశించి కాంట్రవర్సి కామెంట్లు చేయడం తెలిసిందే.కమ్యూనిస్టులు దేశానికి నీచులు, అన్ని వ్యవస్థలను సమూలంగా నాశనం చేసిన వాళ్ళు.
విద్యా వ్యవస్థలో యూనియన్లను తీసుకువచ్చి బ్రష్టు పట్టించారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.దీంతో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు.

సోము వీర్రాజు తన స్థాయికి దిగజారి కామెంట్లు చేయడం సిగ్గుచేటు అని అన్నారు.కార్పొరేట్లకు ఊడిగం చేసే బీజేపీ… ఏడు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసిందో సోము వీర్రాజు తెలియజేయాలని రామకృష్ణ నిలదీశారు.ఇంకా అనేక విషయాలకి సంబంధించి బీజేపీ ఏపీకి చేసింది ఏంటో తెలియజేయాలని కోరారు.ఇదిలా ఉంటే విజయవాడ బీజేపీ “ప్రజాగ్రహ” సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అని మాత్రమే కాకుండా సీపీఎం నాయకుడు నారాయణని ఉద్దేశించి కూడా సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విద్యావ్యవస్థలో యూనియన్ లు రాకపోయి ఉంటే.ఉపాధ్యాయులు ఎంతో నిబద్ధతతో పనిచేసే వాళ్ళు అంటూ సోము వీర్రాజు తన బాల్యంలో ఉపాధ్యాయులు పాఠశాలలు వ్యవహరించిన తీరును ప్రజాగ్రహ సభలో వివరించారు.