కాలుష్య నగరాల్లో కరోనా ప్రభావం ఎక్కువ

కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో జీవనం సాగిస్తున్న ప్రజలు కరోనా భారిన పడితే వారు మృతి చెందే శాతం ఎక్కువగా ఉంటుందని బూస్టన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ యూనివర్శిటీ ఒక అద్యయనంలో పేర్కొనడం జరిగింది.

మెరికాలో పలు ప్రాంతాల్లో కాలుష్యం ఇంకా కరోనా మృతుల సంఖ్యను పరిశీలించినట్లయితే కరోనా వైరస్‌ అనేది కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివషించే వారిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.

కాలుష్యం కోరల్లో ఉన్న వారి అరోగ్యం అప్పటికే చెడిపోయి ఉంటుంది.వారి ఊరిపితిత్తులు ఇంకా పలు శరీర బాగాలు కాలుష్యం కారణంగా చెడిపోయి ఉండటం వల్ల కరోనా సోకిన వెంటనే ఇతరులతో పోల్చితే వారు త్వరగా చనిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

కాలుష్య నగరాల్లో కరోనా గురించి మరింత జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆ అధ్యయనం యొక్క ఉద్దేశ్యంగా కనిపిస్తుంది.ఇండియాలో ఒకటి రెండు నగరాల్లో కాలుష్య ప్రభావం పతాక స్థాయిలో ఉందనే విషయం తెల్సిందే.

కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని అంటున్నారు.

Advertisement
వైరల్ వీడియో : రోహిత్ అభిమానిని చితకబాదిన అమెరికా పోలీసులు..

తాజా వార్తలు