మధురై ఎయిర్ పోర్టులో కరోనా కలకలం

తమిళనాడులోని మధురై ఎయిర్ పోర్టులో కరోనా కలకలం చెలరేగింది.

విమానాశ్రయంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో చైనా నుంచి వచ్చిన ఇద్దరు తల్లీకూతుళ్లకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈ క్రమంలో ఇద్దరి శాంపిల్స్ ను వైద్యాధికారులు ల్యాబ్ కు పంపారని సమాచారం.మరోవైపు మధురై ఎయిర్ పోర్టులో ప్రయాణికులందరికీ సిబ్బంది కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

వీరిలో 20 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.కరోనా కేసులు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయింది.

ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది.బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన కేంద్రం విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు